పవన్ .. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఎవరితో సినిమా చేయనున్నాడు..? ఏ తరహా కథతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు..? అనేది ఆసక్తిగా మారింది. పింక్ రీమేక్ చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి. దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే... తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
అది ఏంటంటే.. పవన్ కళ్యాణ్... డైరెక్టర్ క్రిష్ చెప్పిన కథకి ఓకే చెప్పాడట. జానపద చిత్రంగా ఈ సినిమా ఉంటుందని.. పవన్ కళ్యాణ్ ని సరికొత్తగా చూపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని నవంబర్ 15న ప్రారంభిస్తారని... ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ గా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. మరి.. త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.