ఈ రెండు ఒకటి కాదు.. హాట్‌ టాపిక్‌గా మారిన పరోటా, రోటీ లొల్లి

By సుభాష్  Published on  14 Jun 2020 8:40 AM GMT
ఈ రెండు ఒకటి కాదు.. హాట్‌ టాపిక్‌గా మారిన పరోటా, రోటీ లొల్లి

పరోటా, రోటీ చూడడానికి ఒకేలా కనిపిస్తుంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే జీఎస్‌టీ విషయానికొస్తే వీటి రెండింటి మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. ధరల్లో తేడాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటి గురించి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. ట్విట్టర్‌ వేదికపైగా ఎవరికి నచ్చినట్లుగా వారు జోకులు వేసుకుంటున్నారు. అయితే బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌ లో ఉన్న ఐడీ ఫ్రెష్‌ ఫుడ్‌ అనే సంస్థ అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ కర్ణాటక బెంచ్‌ (ఏఏఆర్‌) ను ఆశ్రయించింది. గోధుమ పిండితో తయారు చేసే చపాతీ, పరోటాల మధ్య ఇంత తేడా ఎందుకని ప్రశ్నించింది. వారి పిటిషన్‌ను విచారించిన ఏఏఆర్‌.. రోటీ రెడీ టు ఈట్‌ ఫుడ్‌ అని, పరోటాను మాత్రమే వేడి చేయాల్సి ఉంటుందని, అందుకే రోటీ విభాగం కిందకు పరోటాను తీసుకువడం కుదరదని స్పష్టం చేసింది. అంతేకాదు పరోటా, రోటీ ఈ రెండు ఒకటి కాదని అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ ప్రకారం.. పరోటాను చాప్టర్‌ హెడ్డింగ్‌ 2106 కింద వర్గీకరించగా, అది సాదా చపాతీ లేదా రోటీ కాదు.. అందుకే 18శాతం వస్తువులు, సేవా పన్ను దానికి వర్తిస్తుందని నిర్ణయించింది. ఐడీ ఫ్రెష్‌ ఫుడ్‌ ప్రై లిమిటెడ్‌ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ చేసిన దరఖాస్తుకు స్పందనగా ఈ విషయాన్ని వెల్లడించింది.

కాగా, గోధుమ పరోటా మరియు మలబార్‌ పరోటా తయారీని 1905వ అధ్యాయం కింద వర్గీకరించాలా ..? వద్దా.. అనే అంశంపై పిటిషన్‌ దారుడు ముందస్తుగా తీర్పును కోరారు. అయితే పరోటాపై జీఎస్‌టీని 5 శాతం ఉంచాలని కోరగా, 1905 లేదా 2106 వర్గీకరణ షరతుల మేరకు పరోటా, రోటీ విభాగంలోకిరాదని, దానిపై 5శాతం జీఎస్టీ రేటు వర్తించదని స్పష్టం చేసింది.

ఈ అంశంపై కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం చాలా సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్‌కు కొత్తగా పరోటా సవాల్‌ వచ్చి చేరిందని ట్విట్టర్‌ వేదికగా ఆనంద్‌ మహేంద్రా కామెంట్‌ చేశారు.Next Story
Share it