మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ ఇది. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ ఎలా ఉండబోతోందనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ బడ్జెట్‌లో ధరలు పెరుగుతాయా..? తగ్గుతాయా..? అనేది అందరిలో ఆసక్తిరేపుతోంది. కాగా, సారి బడ్జెట్‌ అందరికి ఆమోదయోగ్యంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మందగమనం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కన్జ్యూమర్‌ డిమాండ్‌, ఇన్వస్ట్‌ మెంట్‌ పెంచడానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది

అలాగే దాదాపు 50కిపైగా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపునకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్‌ చార్జర్లు, ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌, ల్యాంప్స్‌, ఫర్నచర్స్‌, జువెలరీ, హ్యాండిక్రాప్ట్స్‌ సహా దాదాపు 50కిపైగా ప్రొడక్టులపై దిగుమతి సుంకాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

దిగుమతి సుంకాల పెంపు 5 నుంచి 10 శాతం వరకు..

కేంద్ర సర్కార్‌ ఇప్పటికే ఏఏ వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచాలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. దిగుమతి సుంకాల పెంపు 5 నుంచి 10 శాతం వరకు పేర్కొంటున్నారు. అత్యవసరం కాని వస్తువులను దిగుమతులను తగ్గించడమే లక్ష్యమని చెబుతున్నారు. ఇక దిగుమతి సుంకాల పెంపు వల్ల దేశీ పరిశ్రమలకు ఊరట కలిగించాలని మోదీ సర్కార్‌ భావిస్తోంది.

మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి దిగుమతులపై పలు నియంత్రణలు తీసుకువచ్చారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్‌, డిఫెన్స్‌ సహా ఇతర రంగాల్లో విదేశీ ఇన్వెస్ట్‌ మెంట్లు పెంచడమే అసలు లక్ష్యం. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక కమిటీ 130 వస్తువులపై సుంకాలు పెంచాలని సిఫార్సు చేసింది. కాగా, ఇప్పుడు వీటి సంఖ్య  50కి తగ్గింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.