కేంద్రం కీలక నిర్ణయం..10వేల మంది పారామిలటరీ సిబ్బంది వెనక్కి

By సుభాష్  Published on  19 Aug 2020 3:02 PM GMT
కేంద్రం కీలక నిర్ణయం..10వేల మంది పారామిలటరీ సిబ్బంది వెనక్కి

కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 10వేల మంది పారామిలటరీ సిబ్బందిని వెనక్కి రానున్నాయి. గత సంవత్సరం ఆగస్టు 5న జమ్మూలో స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అక్కడ ఎలాంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించిన విషయం తెలిసిందే.

అయితే జమ్మూకశ్మీర్‌లో కేంద్ర సాయుధ బలగాల మోహరింపు అంశంపై కేంద్ర హోంశాఖ సమీక్ష జరిపింది. ఈ సమీక్ష జరిపిన అనంతరం బలగాలను వెనక్కి రప్పించే విషయమై ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 100 కంపెనీల బలగాలు తక్షణమే వెనక్కి రప్పించాలని, ఇంతకు ముందు వారు పని చేసిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 100 కంపెనీల పారామిలటరీ బలగాల్లో 40 కంపెనీలు సీఆర్పీఎఫ్‌ కాగా, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ బలగాలు చెరో 20 కంపెనీలకు చెందినవి ఉన్నాయి.

అయతే జమ్మూను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఐఏఎస్‌ అధికారి గిరీష్‌ చంద్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించింది కేంద్రం.ఈ ఏడాది కాలంలో ఉగ్రవాదుల ఏరివేతను బలగాలు ముమ్మరం చేయడంతో వ్యాలీలో ఉద్రిక్తతలు సద్దుమణిగిపోయాయి. కాగా, గిరీష్‌ చంద్రను కాగ్‌ అధిపతిగా బదిలీ చేసి, బీజేపీ నేత మనోజ్‌ సిన్హాను కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించినట్లు సమాచారం.

Next Story