మళ్లీ టీవీ స్క్రీన్‌పైకి పరకాల.! ఈ సారి కొత్త టీమ్‌తో.!
By Medi Samrat Published on 14 Nov 2019 1:18 PM ISTపరకాల ప్రభాకర్.. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న ఈయన.. మళ్లీ టీవీ స్కీన్‌మీదకు వస్తున్నారు. మహాన్యూస్ ఛానల్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పరకాల గతంలో ఈటీవీ ప్రతిధ్వని వ్యాఖ్యతగా వ్యవహరించారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నుంచి ప్రజారాజ్యంలోకి జంప్ అయ్యారు. అక్కడి నుంచి టీడీపీతో క్లోజ్‌గా మూవ్ అయ్యారు. చంద్రబాబుకి కమ్యూనికేషన్ సలహాదారుడిగా పనిచేశారు. ఓటుకు నోటు కేసు సమయంలో పరకాల ప్రభాకర్ మాటలు కాంట్రావర్సీగా మారాయి.
ఎన్నికల ముందు ప్రభుత్వ సలహాదారు పదవీ కాలం ముగిసింది. మళ్లీ ఆయనకు రెన్యూవల్ రాకపోవడంతో సొంత వ్యవహారాల్లో మునిగారు. కొంతకాలం వెబ్‌సైట్ నడిపారు. ఇప్పుడు టీవీ స్కీన్ తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి ఆయన మహాస్కీన్ తెరపై కనిపిస్తారు అని ప్రచారం జరుగుతోంది.
టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజనాచౌదరి తిరిగి మహాటీవీని సొంతం చేసుకున్నారని సమాచారం. మహాటీవీ బాధ్యతలను పరకాలకు అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే పరకాల ఇంట్లో కొత్త టీమ్ కోసం అన్వేషణ జరుగుతోంది. జర్నలిస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.
మహాటీవీని కొత్తగా లాంచ్ చేసేందుకు పరకాల టీమ్ ప్రయత్నాలు ప్రారంభించింది. సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ తో కలిసి మహాటీవీ కోసం న్యూ మ్యూజిక్ కంపోజిషన్స్ చేపట్టారు. ఈ ఫోటోలతో ఇప్పుడు పరకాల ప్రభాకర్ కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై చర్చ జరుగుతోంది.
టీడీపీలో ఉన్నప్పుడు కొంతకాలం మహాటీవీని సుజనా చౌదరి రన్ చేశారు. కానీ ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో ముందుకు పోలేదు. మరీ ఇప్పుడు పరకాల సారథ్యంలో ఏవిధంగా దూసుకెళుతుందో చూడాలి.