కేసీఆర్ దత్తపుత్రుడు వైఎస్ జగన్ : పంచుమర్తి అనురాధ

By Newsmeter.Network  Published on  21 Nov 2019 1:51 PM IST
కేసీఆర్ దత్తపుత్రుడు వైఎస్ జగన్ : పంచుమర్తి అనురాధ

ముఖ్యాంశాలు

  • కేసీఆర్ దత్తపుత్రుడు వైఎస్ జగన్: అనురాధ
  • కేసీఆర్ కు ప్రతినిధిలా జగన్ వ్యవహారం ఉంది: అనురాధ
  • ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు పోతున్నాయి: అనురాధ
  • కార్యకర్తలకు జీతాల రూపంలో రూ.7,200 కోట్లు ఇస్తున్నారు : అనురాధ
  • సింగపూర్ ఒప్పందం నుంచి బయటకు రావడం తప్పు : అనురాధ
  • బుగ్గన వ్యాఖ్యలకు రాష్ట్రాభివృద్ధికి సంబంధం లేదు : అనురాధ
  • గంజాయి మాఫీయాను బయటపెట్టింది టీడీపీనే : అనురాధ

అమరావతి: కేసీఆర్‌కు ప్రత్యేక ప్రతినిధిగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కేసీఆర్‌ దత్తపుత్రుడు జగన్మోహన్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులను ఏపీ నుంచి వెళ్లగొడుతుంటే.. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ వాటిని తెలంగాణకు ఆహ్వానిస్తున్నారనపి చెప్పారు. దేశవిదేశాలు తిరిగి చంద్రబాబు ట్టుబడులు ఆకర్షించారని తెలిపారు. 39వేల పరిశ్రమలు తీసుకొచ్చి.. యువతకు 5.5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. ఆ విషయాన్ని జగన్‌ ప్రభుత్వమే శాసన మండలిలో అంగీకరించిందన్నారు అనురాధ. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బును జగన్ కార్యకర్తల కోసం ఖర్చు చేస్తున్నారని అనురాధ ఆరోపించారు. కార్యకర్తలకు జీతాల రూపంలో ఏటా రూ.7,200కోట్లు ఇస్తున్నారన్నారు.

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, లూలూ, అదానీ గ్రూపు, బీఆర్‌టీ సంస్థ, ఒంగోలు పేపర్‌ మిల్లు, కియా అనుబంధ సంస్థలు.. ఇలా కంపెనీలు వెళ్లిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు పంచుమర్తి అనురాధ. రాష్ట్రంలోని నిరుద్యోగస్తులను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏం చేద్దామనుకుంటోందన్నారు. చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ప్రపంచ దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. ఆ పరిశ్రమలను జగన్మోహన్‌రెడ్డి ఇంట్లో కూర్చొని పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారని చెప్పారు.

సింగపూర్‌ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ జరిగి ఉంటే అమరావతి రూపు రేఖలు మారిపోయి ఉండేవన్నారు అనురాధ. 1,600 ఎకరాలలో స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ జరిగి ఉంటే.. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు, యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. హైదరాబాద్‌కు సైబరాబాద్‌ మాదిరిగా.. స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌తో ఏపీకి మరో సైబరాబాద్‌ వచ్చి ఉండేదన్నారు. అవినీతి మచ్చలేని సింగపూర్‌ దేశం.. చంద్రబాబు పై నమ్మకంతో అమరావతిని డెవలప్‌మెంట్‌కు ముందుకొస్తే.. వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అజ్ఞానంతో వెళ్లిగొట్టిందన్నారు.

ఏపీ సమగ్రాభివృద్ధిపై మంత్రి బుగ్గన వ్యాఖ్యలకు.. రాష్ట్ర ప్రభుత్వం చేతలకు పొంతన లేదన్నారు పంచుమర్తి అనురాధ.యువతను గంజాయి మహమ్మారి బారిన పడేస్తున్న వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం పడేస్తుందన్నారు. తాడేపల్లిలో గంజాయికు బానిసైన కుమారుడి గూర్చి.. ఓ మహిళ పడిన ఆవేదన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.గంజాయి మాఫియపై ప్రశ్నించిన తనను సోషల్‌ మీడియా వేదికగా దాడి చేస్తున్నారని వాపోయారు.తెలుగుదేశం పార్టీ పోరాటం వల్లనే తాడేపల్లిలో గంజాయి మాఫియా వెలుగులోకి వచ్చిందన్నారు పంచుమర్తి అనురాధ.

Next Story