య‌ధార్థ‌ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమాలో రక్షిత్, నక్షత్ర హీరోహీరోయ‌న్లుగా న‌టించ‌గా.. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు(శుక్ర‌వారం) విడుదల కానుంది. అయితే తొలి సినిమా విడుదలకు ముందే కరుణ కుమార్ భారీ ఆఫర్‌ దక్కించుకున్నాడు.

అయితే.. కరుణ కుమార్‌ తన రెండో సినిమాను గీతా ఆర్ట్స్‌ వంటి పెద్ద‌ సంస్థలో చేయనున్నాడు. క‌రుణ కుమార్‌ సినిమా భాగా న‌చ్చ‌డంతో గీతా ఆర్ట్స్‌ అధినేత, నిర్మాత అల్లు అరవింద్‌.. అడ్వాన్స్‌గా ఓ చెక్‌ కూడా ఇచ్చాడు. కాగా.. ‘పలాస 1978’ చిత్ర బృందం ఆహ్వానం మేరకు నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్ని వాస్‌లు సినిమా ప్రివ్యూ షో చూశారు.

సినిమా న‌చ్చ‌డంతో దర్శకుడు కరుణ కుమార్‌ను అల్లు అరవింద్‌ అభినందించారు. ఈ చిత్రం చాలా నేచురల్‌గా ఉందని, క‌రుణ కుమార్‌ ప్రతిభ గల డైరెక్టర్‌ అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా అత‌నితో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటిస్తూ మీడియా సమక్షంలోనే అడ్వాన్స్‌గా చెక్‌ను కూడా అందించారు అల్లు అరవింద్‌.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.