తమిళనాడు: సీఎం అభ్యర్థిగా పళనిస్వామి
By సుభాష్Published on : 7 Oct 2020 10:59 AM IST

తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు అన్నా డీఎంకే అప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పార్టీ అధినేత పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో సమిష్టి నాయకత్వం ఏర్పడాల్సి ఉందని, దీనిపై 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీ దృష్టి పెడుతుందని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం వెల్లడించారు.
అయితే వాస్తవానికి డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం కూడా సీఎం అభ్యర్థిగా పోటీపడేందుకు ఆసక్తి చూపారు. అన్నా డీఎంకే పార్టీలో గత కొంతకాలంగా ఈ అంశంలో తీవ్ర చర్చ కొనసాగింది. కానీ సుదీర్ఘ మంతనాల తర్వాత అన్నాడీఎంకే తుది నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామియే సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారని పన్నీరుసెల్వం ప్రకటించారు.
Next Story