ఏపీలో గజం భూమి ధర రూ.2.50 లక్షలు

By రాణి  Published on  27 Feb 2020 5:37 PM IST
ఏపీలో గజం భూమి ధర రూ.2.50 లక్షలు

ఏపీలోని ఒక ఊరిలో గజం భూమి ధర అక్షరాలా రూ.2.50 లక్షలు పలుకుతోంది. సాధారణంగా రూ.32 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉండే గజం భూమి ధర ఏకంగా రూ.2.50 లక్షలు పలకడంతో..ఈ విషయం రికార్డుకెక్కింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కొలువైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో గల భూమి గజం ధర రూ.2.50 లక్షలు పలుకగా..ఓ వ్యక్తి ఒక భాగంలో గజానికి రూ.2.50 లక్షలు, మరో భాగంలో గజానికి రూ.1.75 లక్షలు చెల్లించి 200 గజాల స్థలాన్ని తన సొంత చేసుకున్నాడు. పెద్ద నోట్లు (డీ మానిటైజేషన్) రద్దవ్వక ముందు కూడా ఇక్కడి భూమి గజం రూ.1.25 లక్షలు పలికింది. ఇప్పుడు రూ.2.50 లక్షలు పలకడంతో..ఆ రికార్డును బద్దలు కొట్టి..దాని స్థానంలోకి కొత్తరికార్డొచ్చి చేరింది.

సాధారణంగా చూస్తే..గజం రూ.2.50 లక్షలు పలికేది రాజధాని పరిసర ప్రాంతాల్లోనే.. అలాంటిది ఎక్కడో రాజధానికి దూరంగా ఉన్న పాలకొల్లులో కూడా భూమి అంతరేటు పలికిందంటే అదంతా ఆ రామలింగేశ్వరుడి లీల అని అనుకుంటున్నారు పాలకొల్లు వాసులు. కొందరైతే..బహుశా ఆ భూమిలో ఏదైనా లోహం ఉన్నట్లు పరిశోధనలో తెలుసుకుని ఉంటారు..అందుకే భూమి ధర కోట్లలో ఉన్నా కొనడానికి వెనకాడట్లేదని చెవులు కొరుక్కుంటున్నారు.

Next Story