ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొత్త కారును భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త ప్రారంభ వేరియంట్ డిఫెండర్ 90 ధర రూ.69.99 లక్షలుగా ఉండగా..టాప్ వేరియంట్ డిఫెండర్ 110 (5 డోర్లు) ధర రూ.87.10 లక్షలుగా ఉంది. ఇప్పటి నుంచి కారు బుకింగ్స్ ను తీసుకుంటున్నట్లుగా ల్యాండ్ రోవర్ వెల్లడించింది. డిఫెండర్ 90 తక్కువ వీల్ బేస్, డిఫెండర్ 110కు ఎక్కువ వీల్ బేస్ ను అందించింది తయారీ సంస్థ. కారు మొత్తం బేస్, ఎస్, ఎస్ ఈ, హెచ్ఎస్ ఈ, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లలో లభించనుంది.

ల్యాండ్ రోవర్ సంస్థ ఈ కారును డీ7 ఎక్స్ ప్లాట్ ఫామ్ పై..మొనోకోక్యూ ఛాసిస్ తో నిర్మించింది. ఇప్పటి వరకూ తయారు చేసిన కార్లలో అత్యంత శక్తివంతమైన ఛాసిసే ఇదే కావడం విశేషం. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవనుంది. భారత్ లో మాత్రం 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లో లభిస్తుంది. 292 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. త్వరలో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ ప్లగ్ ఇన్ హైబ్రీడ్ ఇంజిన్ మోడల్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది లాండ్ రోవర్

ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ లపై కూడా అత్యంత సులువుగా ప్రయాణించగలదీ కాదు. ల్యాండ్ రోవర్ పివి ప్రో ఇన్ఫోటైన్ మెంట్, ఓవర్ ది ఎయిర్ తో కనెక్టివిటీ ఫీచర్లు, టచ్ స్ర్కీన్ కు రెండు ఫోన్లను కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. నిరంతరం అలవాటైన మార్గంలో ప్రయాణించేటపుడు తేలిగ్గా నావిగేట్ చేసుకునేలా, 360 డిగ్రీ కెమెరా, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్ స్ర్టుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు..సేఫ్టీ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ను దక్కించుకుందీ ల్యాండ్ రోవర్ డిఫెండర్.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.