నవాజ్ షరీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
By సుభాష్ Published on 18 Oct 2020 10:09 AM GMTప్రభుత్వం కూలదోసింది ఆర్మీ చీఫ్ బజ్వాయేనని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్మీ చీఫ్ బూట్లను శుభ్రం చేసే నవాజ్ షరీఫ్ గద్దెనెక్కారని ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనరల్ జియో ఉల్ హక్ 1980లలో మార్షల్‌లా విధించిన సమయంలో నవాజ్ షరీఫ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారని, ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పాకిస్థాన్ కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న జవాన్లను అవమానించేలా షరీఫ్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల భయంతోనే విదేశాలకు పారిపోయిన వ్యక్తి.. ఆర్మీ చీఫ్, ఐఎస్‌ఐ చీఫ్ గురించి మాట్లాడుతున్నారని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు.
2018లో ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని చేసేందుకు జనరల్ బజ్వాతమ ప్రభుత్వాన్ని పడగొట్టారని షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచేందుకు ఎన్నికల్లో రిగ్గింగ్ చేయించారని, న్యాయ వ్యవస్థపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. వీటన్నింటి వెనుక ఉగ్ర కుట్ర ఉందని అన్నారు. దేశంకోసం సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న సమయంలో సైన్యం నాయకత్వానికి వ్యతిరేకంగా షరీఫ్ మాట్లాడారని దుయ్యబట్టారు.