మసీదులో బాంబు పేలుడు.. 15 మంది మృతి

By సుభాష్  Published on  10 Jan 2020 6:54 PM GMT
మసీదులో బాంబు పేలుడు.. 15 మంది మృతి

పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. బలూచిస్తాన్ క్వెటాలోని ఓ మసీదులో జరిగిన ఈ భారీ పేలుడులో 15 మంది మృతి చెందగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో పోలీసు అధికారితో పాటు, మసీదు ఇమామ్ ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ప్రార్థనలకు వచ్చే వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటన స్థలంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Next Story