పాకిస్తాన్ దోస్తుకు పామాయిల్ దెబ్బ
By సుభాష్ Published on 11 Jan 2020 6:32 AM GMT
మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ నేస్తం మలేషియాకు గట్టి షాక్ ఇచ్చింది. ముస్లిం దేశమైన మలేషియాలో భారతీయులు అనేక మంది ఉన్నారు. ఇండియా - మలేషియా మధ్య మంచి సంబంధాలులే ఉన్నాయి. అయితే కశ్మీర్ విషయంలో, సీ ఏ ఏ విషయంలో పాకిస్తాన్ అనుకూల వైఖరితో పెచ్చరిల్లుతున్న మలేషియాకు ముకుతాడు వేసేందుకు మోదీ ప్రభుత్వం.
గతంలో కశ్మీర్‌లో 370 చట్టాన్ని రద్దు చేసిన సమయంలో కూడా మలేషియా విమర్శలు చేసింది. మలేషియాతో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో తలదూర్చి విమర్శలకు దిగుతోంది. మలేషియా వ్యవహరితున్న తీరును దృష్టిలో ఉంచుకుని భారత్ గట్టి షాకే ఇచ్చింది. మలేషియా నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించింది.
భారత్ ఇకపై రిఫైన్డ్ పామాయిల్ ను కొనుగోలు చేయదు. క్రూడ్ పామాయిల్ ను మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. మనం క్రూడ్ పామాయిల్ ను ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటాం. మలేషియా రిఫైన్డ్ పామాయిల్ ను మాత్రమే ఎగుమతి చేస్తుంది. అంటే ఇకపై మనం ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకుంటాం. అంటే మలేషియాకు భారీ ఆర్ధిక నష్టం జరుగుతుందన్న మాట.