ఔటైన కోపంలో బ్యాట్‌తో బౌలర్‌పై దాడి.. వీడియో వైరల్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2020 2:00 PM IST
ఔటైన కోపంలో బ్యాట్‌తో బౌలర్‌పై దాడి.. వీడియో వైరల్‌..!

వెస్టిండీస్‌లో జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ అసిఫ్ అలీ ప్రవర్తించిన తీరు.. అతడిని చిక్కుల్లో పడేసింది. ఈ పాక్‌ క్రికెటర్‌ ఔటైన కోపంలో బౌలర్‌పై బ్యాట్‌తో దాడికి దిగాడు. అదృష్ట వశాత్తు బ్యాట్‌ బౌలర్‌కు తగలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం జమైకా తల్లావాస్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ 3 పరుగులకే ఔటయ్యాడు. కరీబియన్‌ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లోనూ బారీషాట్‌ ఆడబోయి డీప్ మిడ్-వికెట్ రీజియన్‌లో క్రిస్ గ్రీన్ అద్భుత డ్రైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే అప్పటికే పరుగు కోసం సగం క్రీజులోకి పరిగెత్తుకొచ్చిన ఆసిఫ్ అలీని ఉద్ధేశించి కీమో పాల్‌ ఏమో అన్నాడు.

దాంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ ఆటగాడు విండీస్‌ క్రికెటర్‌ ముఖంపైకి తన బ్యాట్‌ను తిప్పాడు. తృటిలో అది తప్పింది. లేకపోతే కీమో దెబ్బతగిలేది. ఊహించని పరిణామానికి కీయో ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే కీమో పాల్‌ కోపంతో ఆసిఫ్‌ వైపు తిరిగినా అప్పటికే అతను వెళ్లిపోయాడు. మ్యాచ్ రిఫరీ రియాన్ కింగ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతాడని అంపైర్లు పేర్కొన్నారు. ఇక లీగ్ నిబంధనల ప్రకారం అసిఫ్ అలీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక మ్యాచ్ వరకు నిషేధం పడొచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.



Next Story