నేను బంగ్లా జ‌ట్టుతో పాక్‌ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌ను..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 7:36 AM GMT
నేను బంగ్లా జ‌ట్టుతో   పాక్‌ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌ను..!

ఢాకా : పాక్‌ పర్యటనకు వెళ్లే బంగ్లాదేశ్‌ జట్టుతో తాను వెళ్లలేనని బంగ్లాదేశ్‌ మహిళా క్రికెట్​ జట్టు హెడ్‌ కోచ్, భారత మాజీ క్రీడాకారిణి అంజు జైన్‌ బోర్డుకు తెలిపింది. అంజుతో మరో ఇద్దరు కూడా పాక్‌ పర్యటనకు సుముఖంగా లేకపోవడంతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆలోచ‌న‌లో పడింది. బంగ్లా జ‌ట్టు పాక్‌ పర్యటనలో రెండు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సివుంది. దాంతో తాత్కాలిక కోచ్‌ను ఎంపిక చేసి పాక్‌ పర్యటనకు పంపాలనే యోచనలో బీసీబీ ఉంది.

అంజు జైన్ నిర్ణ‌యం ప‌ట్ల‌ బంగ్లాదేశ్‌ టీమ్‌ మేనేజర్‌ జావేద్‌ ఓమర్‌ మాట్లాడుతూ.. భారత్‌ కోచ్‌లు పాక్‌ పర్యటనకు పంపడం అనేది మా చేతుల్లో లేదు. ఇది చాలా సున్నితమైన అంశం’ అని పేర్కొన్నారు. పాక్‌లో బంగ్లాదేశ్‌ పర్యటించడంపై బీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నజాముద్దీన్‌ చౌధురి మాట్లాడుతూ.. భద్రతా పరమైన హామీ లభించిన తర్వాతనే పాక్‌ పర్యటనకు మొగ్గుచూపినట్లు పేర్కొన్నారు.

Next Story
Share it