కుప్పకూలిన యుద్ధ విమానం
By సుభాష్ Published on 15 Sep 2020 9:13 AM GMTపాకిస్థాన్ వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది. సాధారణ శిక్షణలో భాగంగా టేకాప్‌కాగా, అటాక్‌లోని పిండిగెబ్ సమీపంలో అది కుప్పకూలింది. అందులోని పైలట్ సురక్షితంగా బయట పడినట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటన జరగడం ఐదోవదని పాక్ వాయుసేన తెలిపింది. విమానం కూలిపోవడంపై బోర్డు ద్వారా దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపింది.
అయితే మార్చి 23న పెరేడ్‌కు రిహార్సల్ నిర్వహిస్తుండగా పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం ఇస్లామాబాద్‌కు సమీపంలోని షకర్పారియన్ వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రమ్ మృతి చెందాడు. అలాగే ఫిబ్రవరి 12న ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని మర్దాన్ జిల్లాలోని తఖ్త్ భాయ్ సమీపంలో శిక్షణలోభాగంగా పీఏఎప్ టైనర్ విమానం కూలిపోయింది.
రెండు నెలలకన్నా తక్కువ వ్యవధిలో శిక్షణ విమానం కూలడం ఇది మూడోది. ఫిబ్రవరి నెలలోనే పాక్ వాయుసేనకు చెందిన మిరాజ్ యుద్ధ విమానం లాహోర్-ముల్తాన్ రహదారిపై కూలిపోయింది. ఈ రెండు ప్రమాదాల్లో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే జనవరి నెలలో పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్‌టీ-7 యుద్ధ విమానం ట్రైనింగ్ మిషన్ సందర్భంగా మియాన్వాలి సమీపంలో కుప్ప కూలిపోయింది. ఈ ఏడాదిలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఐదోసారి అక్కడి మీడియా పేర్కొంది.