ట్రంప్ పాకిస్తాన్‌ను తెగ పొగిడేశాడట..!

By అంజి  Published on  25 Feb 2020 5:29 AM GMT
ట్రంప్ పాకిస్తాన్‌ను తెగ పొగిడేశాడట..!

పాకిస్తాన్ లో ఇప్పటికీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న సంగతి జగమెరిగిన సత్యం. ఎందరో తీవ్రవాదులకు స్వర్గధామంలా ఉంది పాకిస్తాన్..! అక్కడ తీవ్రవాదులను హీరోలతో పోలుస్తూ ఉంటారు. తీవ్రవాదాన్ని అంతం చేయాలంటే అక్కడి పాలకుల్లో మార్పు రావాలి.. ఎన్నికల సమయాల్లో తాము తీవ్రవాదాన్ని అంతం చేస్తామంటూ ప్రగల్భాలు పలికే అక్కడి రాజకీయ నాయకులు.. అధికారం చేతికి రాగానే తీవ్రవాదులకు, తీవ్రవాదాన్ని ఉసి గొల్పే నాయకులకు తొత్తులుగా మారుతారు. అది కాదని ఏ నాయకుడైనా ఎదురు తిరిగితే అతడి ప్రాణాలు గాల్లోకి కలిసిపోతుంటాయి. ప్రభుత్వాన్నే శాసించే శక్తి పాకిస్తాన్ లో కొన్ని తీవ్రవాద గ్రూపులకు ఉంది.

తాజాగా భారత పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విచ్చేశారు. మొతేరా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని అన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్-అమెరికాది ఒకే సిద్దాంతమన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులను తుదముట్టించామని.. ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని ఇటీవల అమెరికా సైనికులు చంపేశారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇండో-ఫసిఫిక్ రీజియన్ లో శాంతి కోసం ప్రయత్నిద్దామని ట్రంప్ వ్యాఖానించారు. ఇస్లామిక్ టెర్రరిజాన్ని కలిసికట్టుగా అణిచేద్దామని.. టెర్రరిజానికి అడ్డుకట్టవేసేలా పాకిస్తాన్ తోనూ చర్చలు జరుపుతున్నామన్నారు ట్రంప్. పాక్ మంచి మిత్రదేశం అని.. భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గాలని కోరుతున్నామని అన్నారు. కలిసికట్లుగా మనం రెండు దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకుందామని వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ మీడియా మాత్రం ఈ వ్యాఖ్యలను తమ దేశానికి అనుకూలంగా మార్చుకుంది. పాకిస్తాన్ ను అమెరికా ప్రెసిడెంట్ తెగ పొగిడేశారంటూ ఆ దేశ మీడియా భజన చేసింది. ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందే పాక్ ను పొగిడేశారంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రంప్ భారత్ కు వస్తున్నారంటే కనీసం ఆ దేశ మీడియాలో ప్రస్తావన లేదు.. అనధికారికంగా ఈ విషయాలను టెలీకాస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాయి ఆ దేశ వార్తా సంస్థలు. ఎప్పుడైతే పాక్ లోని తీవ్రవాదం గురించి ప్రస్తావించి.. తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తామని.. పాక్ అమెరికాకు కూడా మిత్రుడే అంటూ ప్రస్తావించడంతో ఆ దేశ మీడియాలో ట్రంప్ భారత పర్యటన గురించి తెగ టెలీకాస్ట్ చేశారు. పాకిస్తానీ బోర్డర్ లో ఉన్న మిలిటెంట్ గ్రూప్ లను ఏరిపారేయడమే తమ లక్ష్యమని.. ఇండో-ఫసిఫిక్ రీజియన్ లో శాంతి కోసం ప్రయత్నిద్దామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అక్కడి మీడియాలో పదే.. పదే టెలీకాస్ట్ చేయడం విశేషం.



Next Story