వారి పాదయాత్ర సోనియా మనసును కరిగిస్తుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 1:07 PM GMT
వారి పాదయాత్ర సోనియా మనసును కరిగిస్తుందా..?

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని ఆదిలాబాద్ నుంచి చేపట్టిన 'సంకల్ప పాదయాత్ర' గాంధీభవన్ చేరుకుంది. ఆదిలాబాద్ జిల్లా sc సెల్ కన్వీనర్ సుద్దాల రాజేశ్వర్,జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది గంగారెడ్డి ల ఆధ్వర్యంలో 10 రోజుల పాటు పాదయాత్ర సాగింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్‌ నేతలు 320 కి.మీ పాదయాత్ర చేశారు. పీసీసీ పగ్గాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని పాదయాత్ర చేసిన నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ ఇస్తే కార్యకర్తలను కళ్లలో పెట్టి చూసుకుంటారన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం కోమటిరెడ్డికి పీసీసీ ఇవ్వాలన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి పీసీసీ ఇస్తే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి చరిష్మా ఉందొ.. తెలంగాణ లో కోమటిరెడ్డి కి అలాంటి ఛర్మిష ఉందన్నారు కాంగ్రెస్‌ నేతలు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు కూడా కోమటిరెడ్డి కి పీసీసీ రావాలని కోరుకుంటున్నారన్నారు.

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే శక్తి కోమటిరెడ్డికి ఉందన్నారు పాదయాత్రలో పాల్గోన్న కాంగ్రెస్ నేతలు. పార్టీ పగ్గాలు కోమటిరెడ్డి కి ఇస్తే ..పాదయాత్ర కానీ రథ యాత్ర గాని చేసి పార్టీని అధికారంలోకి తీసుకవస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇప్పటికే పీసీసీ నుంచి తప్పించాలని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఏఐసీసీని కోరారు. అయితే..తెలంగాణ పీసీసీ పీఠానికి తీవ్రమైన పోటీ ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి క్యాడర్‌ కూడా ఉంది. అయితే..ఈయన వైఎస్ఆర్‌ వర్గీయుడు అనే ముద్ర మైనస్‌గా మారుతుంది. కాని..అదే ప్లస్ అని కాంగ్రెస్ అధిష్టానం గ్రహించాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఇక ..రేవంత్ రెడ్డి కూడా పీసీసీ కోసం తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే..రేవంత్ రెడ్డి దూకుడు, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం, సీనియర్లను కలుపుకుపోక పోవడం రేవంత్ రెడ్డికి మైనస్ అని చెప్పాలి. ప్రగతి భవన్ ముట్టడి విషయంలో రేవంత్ రెడ్డిపై ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి ఇద్దరూ ఒకే సామాజిక వర్గం వారు . ఇద్దరూ దక్షిణ తెలంగాణకు చెందినవారు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఉంటుందో చూడాలి. మరో వైపు..కొంత మంది బీసీ నేతలు కూడా పీసీసీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరికి కాంగ్రెస్ లోని బీసీ పెద్దల అండదండలున్నాయి. కేసీఆర్‌ లాంటి రాజకీయ ఉద్దండున్నీ ఢీకోవాలంటే.. సహనంతోపాటు, స్పీడ్ ముఖ్యం, అన్ని వర్గాలను కలుపుకుపోయే నేర్పరితనం ఉండాలి. అయితే..తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. కాంగ్రెస్‌లో ఆ సామాజిక వర్గ నేతలే ఎక్కువ. వారిని కాదని వేరే సామాజిక వర్గానికి పీసీసీ పీఠం ఇచ్చే సాహసం టెన్‌ జన్‌ పథ్ చేస్తుందా అనేది చూడాలి.మొత్తానికి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సామే.

Next Story