ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు పలు విభాగాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. వాటిల్లో వైద్య రంగం ఒకటి. కరోనా వచ్చిన వారికి తమ ప్రాణాలనుసైతం లెక్కచేకుండా వైద్యసేవలు అందిస్తున్నారు వైద్యులు. ఇదే క్రమంలో మనదేశంలో పలువురికి కరోనా పాజిటివ్‌ సోకగా వారికి ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైద్యులు సరియైన రక్షణ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు వైద్యసేవలు అందించే క్రమంలో వైద్యులకు అనేక సదుపాయాలు కల్పిస్తుంది. తాజాగా మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తేనుంది. దీనిలో భాగంగా భారత్‌కు చైనా నుంచి 1.70లక్షల పీపీఈలు రానున్నాయి.

Also Read :హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

వీటిని చైనా విరాళంగా అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటికి దేశీయంగా తయారైన మరో 20వేల పీపీఈలను కలిపి మొత్తం 1.90లక్షల పీపీఈలు ఆసుపత్రులకు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు 2.94 లక్షల పీపీఈలు సరఫరా చేశామని, వీటితో కలిపి మొత్తం 4.84లక్షల పీపీఈలు అందుబాటులో ఉన్నట్లయిందని తెలిపింది. దీనికితోడు 18లక్షల ఎన్‌- 95 మాస్కులను రాష్ట్రాలకు పంపిణీ చేశామని, దేశీయంగా తయారైన మరో రెండు లక్షల మాస్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Also Read :హైదరాబాద్‌ పోలీసు విభాగంలో కరోనా పాజిటివ్‌

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్