ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షా ఫలితాలు విడుదల
By తోట వంశీ కుమార్ Published on 25 April 2020 4:16 PM ISTఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac. inలో ఉంచినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్, మరాఠీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లిష్ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎం.కాం మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లు వివరించారు.
Next Story