'క‌ల‌లు చూసినా క‌న్నులే.. నేడు మోసెనే క‌న్నీల్లే'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 2:31 PM GMT
క‌ల‌లు చూసినా క‌న్నులే..  నేడు మోసెనే క‌న్నీల్లే

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ఒరేయ్‌ బుజ్జిగా. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాస్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘క‌ల‌లు చూసినా క‌న్నులే నేడు మోసెనే క‌న్నీల్లే.. హాయి పంచినా గుండెకే ఓ గాయ‌మ‌య్యెనే.. ఓహో జంట న‌డిచినా అడుగులే ఒంట‌ర‌య్య‌నే ఇవ్వాలే.. వెలుగు నిచ్చినా నీడ‌కే మిగిలింది చీక‌టే..’ అనే పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ రాయగా, గాయకుడు సిధ్ శ్రీ‌రామ్ పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇంకా ఈ సినిమాలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

Next Story