చార్మీ ఇంట్లో విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 1:39 PM GMT
చార్మీ ఇంట్లో విషాదం

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. చార్మి ఎంత బిజీగా ఉన్నప్పటికి తన ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధింని విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల వాళ్ల ఫ్యామిలీలో ఓ బాబు పుడితే.. ఆ ఆనందాన్ని సామాజిక మాధ్యమంలో షేర్‌ చేసింది. తాజాగా తన బంధువు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. సోషల్ మీడియా వేదికగా బావోద్వేగపు పోస్టు చేసింది.

ఇక లేరు అనే మాటే వినడానికి నాకు నచ్చదు.. నిన్ననే మనం చివరగా వీడియో కాల్ మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నాను. పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతూ ఉంటాను. నీ లోటు భర్తీ చేయలేనిది.. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాల'ని ఛార్మీ ఎమోషనల్ అయింది. ఆమెతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక అటు చార్మీ చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో చార్మీ నిర్మాతగా మారారు.. ఆమె చివరిసారిగా జ్యోతి లక్ష్మి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి నిర్మాత కూడా చార్మీనే.. ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరితో కలసి నిర్మించింది. ఈ సినిమా అటు పూరికి ఇటు చార్మీకి మంచి పేరును తీసుకువచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫైటర్ అనే సినిమాకి కూడా చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Next Story