‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సక్సెస్ మీట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 8:59 AM GMT
‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సక్సెస్ మీట్

సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా నటించిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ఎయిర్ టెల్ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదలైంది. సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ.. సినిమాకు చాలా మంచి అప్లాజ్‌ వచ్చింది. అందరూ బావుందని చెబుతున్నారు. అర్జున్‌ పండిట్‌ పాత్రలో నా నటన, సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ప్రతిరోజూ గర్వపడుతూ ఈ సినిమా చేశాను. నా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీలు కాంప్లిమెంట్స్‌ ఇస్తుంటే సంతోషంగా ఉంది. కలెక్షన్లు కూడా బావున్నాయి. ప్రతిచోట పాజిటివ్‌ రిపోర్ట్‌ వస్తోందన్నారు.

దర్శకుడు సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ... శుక్రవారం మా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ విడుదలైంది. అన్నిచోట్ల నుండి సినిమా చాలా బావుందనే టాక్‌ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం వెనుక చాలామంది ఉన్నారు. అబ్బూరి రవి, ఆది సాయికుమార్‌, కార్తీక్‌ రాజు, పార్వతీశం, మనోజ్‌ నందం, నిత్య, ఎయిర్‌టెల్‌ గాళ్‌ శషా, కృష్ణుడు, రావు రమేశ్‌గారు… వీరందరూ ఎంతో మద్దతుగా నిలిచారు. అలాగే, సినిమాటోగ్రాఫర్‌ జయపాల్‌, సంగీత దర్శకుడు శ్రీచరణ్‌. మాకు ఆదిత్య మ్యూజిక్‌ వాళ్లు గ్రేట్‌ సపోర్ట్‌ ఇచ్చారు. వాళ్లకూ థ్యాంక్స్‌. మా టెక్నిషియన్స్‌, టీమ్‌ హార్డ్‌ వర్క్‌తో ఈ సినిమా పూర్తయింది. సినిమా బావుందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. కొత్తగా ఉందని ప్రేక్షకులు రివ్యూలు రాస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ... సినిమా తీయడానికి సాయికిరణ్‌ అడివిగారు ఎంత కష్టపడ్డారో… సినిమాను ప్రేక్షకులకు చూపించడానికి పద్మనాభ రెడ్డిగారు అంతే కష్టపడ్డారు. ఆయనకు చాలా చాలా థ్యాంక్స్‌. ఒక పాట లేకున్నా, గ్లామర్‌ ఎపిసోడ్‌ లేకున్నా… అర్జున్‌ పండిట్‌ పాత్ర చేయడానికి ఒప్పుకున్న ఆదిగారికి థ్యాంక్స్‌. నాకు తెలిసి హీరోలందరూ నిలబడేది క్యారెక్టర్ల వల్లే. అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆయన చాలా బాగా చేశారు. దర్శకుడు సాయికిరణ్‌ అడివి ఎన్ని కష్టాలు పడి సినిమా చేశారనేది నాకు తెలుసు. అందరూ ఆయన కోసమే ఈ సినిమా చేశారు. కథ అద్భుతంగా తయారు చేసుకున్న, ఈరోజు విజయం అందుకున్న సాయికిరణ్‌గారికి అభినందనలు. ఇటువంటి సినిమా థియేటర్‌కు వెళ్లి చూస్తే… మనది అన్న ఒక ఫీలింగ్‌ వస్తుంది అని అన్నారు.

Next Story