రహదారి, వాయు రవాణాకు అనుమతివ్వండి - కేంద్ర మాజీమంత్రి చిదంబరం
By Newsmeter.Network
రహదారి, వాయు రవాణా కార్యకలాపాలను అనుమతించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం సోమవారం ప్రభుత్వాన్ని కోరారు, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు సమర్థవంతంగా తిరిగి ప్రారంభించగల ఏకైక మార్గం ఇదే అన్నారు. ఎంపిక చేసిన ఇతర రాష్ట్రాల రైలు సేవలను ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చిదంబరం తెలిపారు. ఢిల్లి వేదికగా చేసుకొని దేశవ్యాప్తంగా కొన్ని ఎంపిక స్టేషన్లకు అనుసంధానిస్తూ మే12 నుంచి రైలు సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది, దీనికి బుకింగ్‌లు సోమవారం నుంచి ఐఆర్‌సిటిసి ప్రారంభించింది.
Also Read :భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 4213 కేసులు
ఇంటర్ స్టేట్ ప్యాసింజర్ రైళ్ల ఆపరేషన్‌ను జాగ్రత్తగా ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని, అదేవిధంగా రహదారి రవాణా, వాయు రవాణానుప్రారంభించాలని మాజీ ఆర్థిక మంత్రి అన్నారు. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించే ఏకైక మార్గం వాయు, రహదారి రవాణా అని, ప్రయాణీకుల తరలింపు, వస్తువుల కోసం రహదారి, రైలు, విమాన సేవలను ప్రారంభించాలని చిదంబరం తన ట్విట్టర్‌లో తెలిపారు. కరోనావైరస్ కారణంగా అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ దృష్ట్యా నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పేదలకు ఉపశమన ప్యాకేజీ, పరిశ్రమకు సహాయపడే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం విధితమే.
Also Read :దిల్‌రాజ్ పెళ్లిఫోటోలు వైరల్..