శుభవార్త: 20 నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రారంభం

By సుభాష్  Published on  16 April 2020 1:08 PM GMT
శుభవార్త: 20 నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రారంభం

కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ దెబ్బకు ఆన్‌లైన్‌ షాపింగ్‌లు కూడా నిలిచిపోయాయి. కేవలం నిత్యావసరాలు, వస్తువులు మాత్రమే సరఫరా జరుగుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం రెండో విడత లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని సడలింపులు ఉంటాయని కేంద్ర మార్గదర్శనాలకు విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీంతో మొబైల్స్‌, టీవీలు, ఇతర నాన్‌ ఎసెన్షియల్‌ గూడ్స్‌ను అమ్మేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఇ-కామర్స్‌ సైట్లు ఆర్డర్స్‌ తీసుకోనున్నాయి. గతంలో చేసిన ఆర్డర్స్‌ ఏప్రిల్‌ 20 నుంచి డెలివరీ చేయనున్నారు. వీటికి సంబంధించిన ఉద్యోగులు సైతం పని చేసేందుకు అనుమతి లభించింది. కానీ సోషల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి పాటించాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం.

ఇక లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుండటంతో ల్యాబ్‌టాప్స్‌, డెస్క్‌టాప్స్‌, కంప్యూటర్‌ పరికరాలు, స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ మోడెమ్స్‌ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు చాలా డిమాండ్‌ పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కేంద్రం ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అనుమతులు ఇచ్చింది.

Next Story
Share it