మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్ ఆర్డర్‌లతో మద్యం సరఫరా
By అంజి
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం అక్కడి మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యానికి బాగా అలవాడు పడిన మందుబాబులకు మద్యం అందించేలా పినరయి విజయన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టే వేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ వైన్‌షాపులు, బార్‌లు మూతపడ్డాయి. వైన్ షాప్స్ బంద్ కావడంతో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మందుకు బానిసైన వారు గత కొన్ని రోజులుగా మద్యం దొరకకపోయేసరికి పిచ్చి పట్టినట్లు, మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Also Read: మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ సూచనలు ఇవే..!
లాక్‌డౌన్‌లో భాగంగా కేరళలో పినరయి విజయన్ సర్కార్ మందు షాపులను మూసివేసింది. దీంతో మందు దొరక్క ఇప్పటి వరకు తొమ్మిది మంది మందు ప్రియులు మరణించారు. ఈ తొమ్మిది మందిలో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరొకరు ఆప్టర్ షేవ్ లోషన్ తాగి చనిపోయాడు. మరోకరు గుండెపోటుతో మరణించాడు. తాజాగా ఓ 46 ఏళ్ల వ్యక్తి మద్యం దొరక్క పోవడంతో బిల్డింగ్‌పై నుంచి దూకాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మద్యం ప్రియులకు మద్యం దొరకకపోవడంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. మద్యం సుక్క లేకుండా మద్యం బాబులు నిలకడగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడిది.. కేరళ సీఎం పినరయి విజయన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. వెంటనే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి మద్యం అందేలా చర్యలకు ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా మద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారని సమాచారం. అయితే మందు ప్రియులు డాక్టర్ వద్ద నుంచి ప్రిస్కిప్షన్ తెచ్చుకోవాలని ప్రభుత్వం నిబంధంన విధించింది.
Also Read: మందు దొరక్క ఏడుగురు ఆత్మహత్య