ఒక్కసారిగా కారులో మంటలు.. తర్వాత ఏమైందంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 6:39 AM GMT
ఒక్కసారిగా కారులో మంటలు.. తర్వాత ఏమైందంటే?

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌ మెట్టు మండలం లష్కర్‌ గూడ వద్ద ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. లష్కర్‌గూడ శివారులో వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోచంపల్లి నుంచి అనాజ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను చెలరేగడంతో కారులోని ప్రయాణికులు బయటకి దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది..మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో విజయవాడ నేషనల్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Next Story
Share it