#BlackLivesMatter అనే ఉద్యమం తీవ్రమవుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో బోస్టన్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ఓ ముస్లిం అమ్మాయిని పూర్తిగా చెక్ చేస్తూ.. చివరికి ఆమె శానిటరీ ప్యాడ్ ను కూడా చెక్ చేశారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
“27 years old Zainab was forced to remove her pants at the Boston airport despite being a US citizen publicly while she was on her period. She was asked to remove her pad for security purposes and this action was so disrespectful and humiliating for any girl. How was she a threat? (sic)” అంటూ పలువురు ఈ పోస్టులను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
27 సంవత్సరాల జైనాబ్ ను చెకింగ్ చేస్తున్న సమయంలో ఆమె ప్యాంట్ విప్పాల్సిందిగా అక్కడి సిబ్బంది కోరింది. అమెరికా సిటిజన్ అయినప్పటికీ వివక్ష చూపించారు అధికారులు. తాను పీరియడ్స్ లో ఉన్నాను అని చెప్పినా కూడా అక్కడి అధికారులు ఏ మాత్రం ఆమెకు మర్యాద ఇవ్వకుండా శానిటరీ ప్యాడ్ ను కూడా చూడాలని కోరారని.. మానవత్వం లేకుండా ఇలా అధికారులు ప్రవర్తిస్తారా..? అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు.
జైనాబ్ మర్చంట్ అనే ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో కూడా ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు.
Blacklivesmatter20 అనే ఇంస్టాగ్రామ్ పేజీలో జైనాబ్ చెప్పినట్లుగా 'ఆ ఘటన ఎంతగానో బాధపెట్టింది. ప్రతి ఒక్కటీ తెరచి చూసారు. బ్రా, అండర్ వేర్ అన్నిటినీ బహిరంగంగానే తెరిచారు. సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది' అంటూ లేడీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను చెకింగ్ చేస్తున్న ఫోటోలను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
'Zainab forced to remove underpants’ ను ఉపయోగించి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోడానికి ప్రయత్నించగా HuffPost కు సంబంధించిన ఆర్టికల్ ను చూడొచ్చు. ఆగస్టు 23, 2018 న ఈ వార్తను ప్రచురించారు.
ఆ ఆర్టికల్ ప్రకారం జైనాబ్ మర్చంట్ హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. జైనాబ్ రైట్స్ అనే వెబ్సైట్ కు ఎడిటర్ ఆమె. బోస్టన్ నుండి వాషింగ్టన్ డిసి కి ఆమె వెళుతున్న సమయంలో ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) ఏజెంట్లు ఆమెను చెకింగ్ చేశారు. ఆ సమయంలో ఆమెను అండర్ వేర్ ను కూడా చూపించమని కోరారు.
Washington Post కు ఆమె తన ఒపీనియన్ పీస్ ను రాసుకుని వచ్చింది. తనకు పలుమార్లు ఇలాంటి అవమానాలు జరిగాయంటూ రాసుకుని వచ్చింది. తాను అనుసరిస్తున్న మతం కారణంగానే ఈ అవమానాలు వివిధ సార్లు జరిగాయని బాధను వ్యక్తం చేసింది. తనకు ఎయిర్ పోర్టులో జరిగిన అవమానాన్ని తెలియజేస్తూ ఆమె రాసిన ఒపీనియన్ పీస్ ఆగస్టు 15, 2018న పబ్లిష్ అయింది.
జైనాబ్ మర్చంట్ కు ఈ అవమానం జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. ‘#BlackLivesMatter’ క్యాంపెయిన్ లో ఈ ఘటనకు సంబంధించి కూడా పలువురు షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ ఘటన ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్నదంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.