హైదరాబాద్‌: నాంపల్లిలో ఓ పురాతన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనంలో ఉంటున్న యాచకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న పురాతన హెరిటేజ్‌ భవనం శనివారం మధ్యాహ్నం కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది భవనాన్ని పూర్తిగా కూల్చివేసే పనిలో ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story