పశువుల వ్యర్ధాల నుంచి నూనె, సబ్బులు ..SOT పోలీసుల దాడి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 4:48 PM GMT
పశువుల వ్యర్ధాల నుంచి నూనె, సబ్బులు ..SOT పోలీసుల దాడి

రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవుపల్లి పీఎస్ పరిధి అలీనగర్ లో అక్రమంగా పశువుల వ్యర్థాలతో నూనె తీస్తున్నారు. వీటి నుంచి సబ్బులు తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు. కంపెనీ సీజ్ చేశారు. ముగ్గురు నిర్వహకులను అరెస్ట్ చేశారు. నమూనాలు తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు అప్పగించారు.

ఇదే కాక..హైదరాబాద్ శివారులో చాలా ఇలాంటి పరిశ్రమలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే..వాటిపై చర్యలు తీసుకోవాలని, కంపు భరించలేకపోతున్నామని చాలా ఏళ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పశువ్యర్ధాల పరిశ్రమల సంగతి అధికారులకు తెలిసినప్పటికీ..కొన్నింటిని చూసిచూడనట్లు వదిలేస్తున్నారనేది స్థానికుల ఆరోపణ.

Next Story