న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్పి.. ఇదేం పాడు ప‌డి..!

Youngman Hulchal in karimnagar.మందుబాబులు మ‌ద్యం మ‌త్తులో సృష్టించే వీరంగాలు మామూలుగా ఉండ‌వు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 4:16 AM GMT
న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్పి.. ఇదేం పాడు ప‌డి..!

మందుబాబులు మ‌ద్యం మ‌త్తులో సృష్టించే వీరంగాలు మామూలుగా ఉండ‌వు. ఒక్క పెగ్గు లొప‌లికి పోయిందా.. ఎక్క‌డ ఉన్నాం. ఏం చేస్తున్నాం అన్న సంగ‌తే తెలియ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. వీరి చేసే ప‌నుల వ‌ల్ల చాలా మంది ఇబ్బందుల‌కు గుర‌వుతుంటారు. ఒక్కొసారి వీరు చేసే ప‌నులు ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగిస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో పోలీసులు వ‌చ్చి మందుబాబుల‌కు స‌రైన బుద్ది చెబుతుంటారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం ఎన్నో చూశాం.

తాజాగా మ‌త్తు ప‌దార్థాల‌కు అల‌వాటు ప‌డిన ఓ యువ‌కుడు క‌రీంన‌గ‌ర్‌లో వీరంగం సృష్టించాడు. లాక్‌డౌన్ విరామ స‌మ‌యంలో గీతా భ‌వ‌న్ నుంచి బ‌స్టాండ్‌కు వెళ్లే మార్గంలో వ‌చ్చిపోయే వాహ‌నాల‌ను ఆపేశాడు. మ‌త్తులో బట్టలు విప్పేసి లోచెడ్డీపై హల్ చల్ చేశాడు. ఓ కారుపైకి ఎక్కి ఆ వాహ‌న‌దారుడికి చుక్క‌లు చూపించాడు. ఆ కారు అతను మెల్లిగా ముందుకు వెళ్ళేలా చేస్తే వెంటనే కిందికి దిగి కారు టైరు కింద దూరే ప్రయత్నం చేశాడు. దాదాపు గంట సేపు అక్క‌డి వారికి చుక్క‌లు చూపించాడు.

విసిరి వేసారిన స్థానికులు అత‌డిని ప‌ట్టుకుని తాళ్ల‌తో చెట్టుకు క‌ట్టేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు వ‌చ్చి అత‌డికి మ‌త్తు వ‌దిలించారు. అత‌డి వివ‌రాలు ఆరా తీయ‌గా.. అత‌ని పేరు రాజు అని, వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట స‌మీపంలో ఉన్న ఓ మారుమూల గ్రామానికి చెందిన వాడు అన్న విష‌యాన్ని గుర్తించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story