వ‌రుడు ప‌క్క‌నుండగానే.. వ‌ధువుకు ముద్దులు పెట్టిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్‌

Young man kisses to Bride in a marriage video goes viral.క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండడంతో వివాహాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 6:47 AM GMT
వ‌రుడు ప‌క్క‌నుండగానే.. వ‌ధువుకు ముద్దులు పెట్టిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్‌

క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండడంతో వివాహాలు ఊపందుకున్నాయి. ఇక పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌ధునారానుభూతి అనే చెప్ప‌వ‌చ్చు. పెళ్లి రోజున జ‌రిగే ఘ‌ట‌న‌ల‌ను త‌మ జీవితాంతం జ్ఞాప‌కంగా దాచుకుంటారు. ఇక పెళ్లిలో వ‌ధువు లేదా వ‌రుడి లేదా ఇద్ద‌రిని ఆట‌ప‌ట్టిస్తుంటారు. అయితే.. ఓ పెళ్లిలో మాత్రం ఓ యువ‌కుడు చేసిన ప‌నితో వ‌రుడు దెబ్బ‌కు షాక్‌కు గురైయ్యాడు. ఆ యువ‌కుడు స్టేజి పైకి వ‌చ్చి అంద‌రూ చూస్తుండ‌గా.. ప‌క్క‌న వ‌రుడు ఉండ‌గానే పెళ్లికూతురిపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. దీనిని చూసిన వ‌రుడు తెల్ల‌ముఖం వేశాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది. ఎవ‌రువీడియో తీశారు అన్న సంగ‌తి అయితే.. తెలియ‌దు. ఇంత‌కీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. రిసెప్ష‌న్ సంద‌ర్భంగా వ‌రుడు, వ‌ధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఓ యువ‌కుడు స్టేజి పైకి వ‌చ్చాడు. వ‌రుడు, వ‌ధువు మ‌ధ్య‌లో కూర్చొన్నాడు. వ‌ధువు వైపు తిరిగి ముద్దులు పెట్ట‌డం మొద‌లుపెట్టాడు. ఈ ఘ‌ట‌న చూస్తున్న‌వారంతా షాక్ కు గురైయ్యారు. ఆ యువ‌కుడు ఏం చేస్తున్నాడా అని వ‌రుడు ఆస‌క్తిగా చూస్తుండ‌డం విశేషం. ఆ స‌మ‌యంలో వ‌రుడి ముఖం మాత్రం పాలిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది.

అయితే.. వ‌రుడిని ఆట‌ప‌ట్టించేందుకే అమ్మాయి త‌రుపు బంధువులు ఇలా ప్లాన్ చేసి ఉంటార‌ని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి మ‌రీ ఇంతలా దిగ‌జారి ప్ర‌వ‌ర్తించాలా అంటూ మ‌రికొంద‌రు విమ‌ర్శులు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story