గోల్డ్‌తో తయారు చేసిన బిర్యానీ.. ప్లేట్ రూ.20వేలు మాత్రమే..!
World most expensive Biryani with edible 23 karat gold in Dubai.బిర్యానీ రేటు ఎంత ఉంటుంది చెప్పండి. ప్లేట్ రూ.20వేలు మాత్రమే.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2021 12:43 PM GMTబిర్యానీ రేటు ఎంత ఉంటుంది చెప్పండి. సాధారణంగా ప్లేట్ బిర్యానీ అయితే రూ.100 నుంచి రూ.1000దాకా ఉంటుంది. అది కూడా అందులో ఉపయోగించే రైస్, మాంసం, ఆయా ప్రాంతాల్లో ఉంటే రెస్టారెంట్లను బట్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే బిర్యానీ రేటు తెలిస్తే మీరు నోరెళ్లపెట్టడం ఖాయం. ఎంత అని అంటారా..? అక్షరాల రూ.20వేల రూపాయలు. ఎందుకంటే అది గోల్డ్ బిర్యానీ కాబట్టి. గోల్డ్ బిర్యానీ అంటే.. నిజంగా బంగారంతో చేస్తారా..? అనే డౌట్ మీకు రావచ్చు. మీ అనుమానం నిజమే. ఈ బిర్యానీ తయారీలో బంగారాన్ని వాడుతారు. అందుకనే దీనికి అంత రేటు సుమీ.
దుబాయ్‌లోని ఓ బ్రిటిష్ కాలం నాటి బంగ్లా ఇప్పుడు 'బాంబే బరో' పేరుతో లగ్జరీ హోటల్‌గా మారిపోయింది. ఇటీవలే ప్రారంభమైన ఈ హోటల్‌లో బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. 'రాయల్ గోల్డ్ బిర్యానీ' పేరుతో అందించే ఈ బిర్యానీ ప్లేట్ ధర 1,000 దిర్హమ్‌లు. అంటే.. మన కరెన్సీలో రూ. 19,704. హోటల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా మెనూలో దీనిని చేర్చారు. 23 కేరట్ల తినే బంగారంతో గార్నిష్ చేసి దీన్ని వడ్డిస్తారు. మూడు కేజీల ఈ బిర్యానీని పెద్ద గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో సర్వ్ చేస్తారు. ఇందులో చికెన్ బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్/శాఫ్రాన్ రైస్ వేరియంట్లు లభిస్తాయి. బేబీ ఆలుగడ్డలు, ఉడకించిన గుడ్ల, జీడీపప్పు, దానిమ్మ గింజలు వాటిపై అలంకరిస్తారు.
అన్నంపై కశ్మీరీ ల్యాంబ్ సీక్ కెబాబ్స్, పాత ఢిల్లీ ల్యాంబ్ చాప్స్, రాజ్‌పుట్ చికెన్ కెబాబ్స్, ముఘలాయ్ కోఫ్తాలు, మలాయ్ చికెన్ వంటివాటిని బిర్యానీపై అలంకరించి అందిస్తారు. బిర్యానీతో పాటు నిహారీ సలాన్, జోధ్‌పురి సలాన్, బాదామీ సాస్, రైతాను ఇస్తారు. ఈ ప్లేట్ సర్వ్ చేసేందుకు 45 నిమిషాలు పడుతుంది. ఇది ఒక్కటి నలుగురి నుంచి ఆరుగురికి ఎంచక్కా సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదేనని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.