ఆమె శ‌రీరంలో 216 రోజుల పాటు బ‌తికున్న క‌రోనా.. 32 ర‌కాల మ్యూటేష‌న్స్‌

Woman with HIV Carries Covid For More Than 6 Months.క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 12:47 PM GMT
ఆమె శ‌రీరంలో 216 రోజుల పాటు బ‌తికున్న క‌రోనా.. 32 ర‌కాల మ్యూటేష‌న్స్‌

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపాంత‌రం చెందుతూ విజృంభిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో ఓ మ‌హిళ శ‌రీరంలో ప‌దుల కొద్దీ క‌రోనా మ్యూటేష‌న్స్‌ను గుర్తించిన సైంటిస్టులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. 36 ఏళ్ల మ‌హిళ శ‌రీరంలో 216 రోజుల పాటు క‌రోనా వైర‌స్ బ‌తికి ఉంద‌ని గుర్తించారు. హెచ్ఐవీతో బాధ‌ప‌డుతున్న స‌ద‌రు మ‌హిళ శ‌రీరంలో 32 ర‌కాల క‌రోనా వైర‌స్ మ్యుటేష‌న్స్ ఉన్న‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలింది. మెడిక‌ల్ జ‌ర్న‌ల్ మెడ్రిక్స్ వి ఈ అసాదార‌ణ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌చురించింది.

స‌ద‌రు మ‌హిళ 2006లో హెచ్ఐవీ బారీన ప‌డింది. దీంతో ఆమె రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కీణిస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆమెకు 2020 సెప్టెంబరులో క‌రోనా సోకింది. అప్ప‌టి నుంచి ఆమెలో స్పైక్ ప్రొటీన్ 13 ర‌కాలుగా ఉత్ప‌రివ‌ర్త‌నం చెంద‌గా, జ‌న్యుప‌రంగా 19 ర‌కాలుగా రూపాంత‌రం చెందింది. వైరస్ 'బిహేవియర్' ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందట. బ్రిటన్ లో మొదట గుర్తించిన బీ.1.1.7, ఆ తరువాత ఎన్.510 వై మ్యుటేషన్, (ఇది బేటా వేరియంట్ బీ.1.351 లో భాగమట) ఇలా ఆమె శ‌రీర‌రంలో ప‌లు ర‌కాల క‌రోనా వైర‌స్ ఉత్ప‌రివ‌ర్త‌నం చెంద‌డాన్ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇంతకీ ఈ మహిళ బతికే ఉందా..ఉంటే ఎలా ఉంది అన్న విషయాలు తెలియలేదు.

హెచ్ఐవీ రోగుల్లో మ్యుటేషన్ కి, క‌రోనా వైరస్ కి స్ట్రాంగ్ లింక్ ఉంటుందని అంటున్నారు. అయితే ఇంకా దీనిపై పరిశోధనలు జరగాలంటున్నారు. ఇండియాలో సుమారు 10 లక్షల మంది హెచ్ఐవీ రోగులున్నారని అంచనా.హెచ్ఐవీ బారిన ప‌డిన‌వారు క‌రోనా విష‌యంలో అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

Next Story