వైఫ్ ఆఫ్ ది ఇయ‌ర్‌.. భ‌ర్త‌కు ముద్దు ఇవ్వ‌బోయిన భార్య‌.. వీడియో వైర‌ల్‌

Woman tries to kiss husband during zoom call meeting viral video.క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని మ‌న జీవితంలో చాలా మార్పులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2021 7:56 AM GMT
వైఫ్ ఆఫ్ ది ఇయ‌ర్‌.. భ‌ర్త‌కు ముద్దు ఇవ్వ‌బోయిన భార్య‌.. వీడియో వైర‌ల్‌

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని మ‌న జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ మ‌హ‌మ్మారి నిర్మూల‌న కాక‌పోవ‌డంతో.. చాలా వ‌ర‌కు వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే ఇంట‌ర్వ్యూలు, ఫాఠాలు భోధించ‌డం వంటివి చేస్తున్నారు. ఇంట్లో ఉండి ప‌నిచేస్తుండ‌డంతో.. అప్పుడ‌ప్పుడూ ఇంట్లో వాళ్లు క‌న‌ప‌డుతుంటారు. వారు చేసే ప‌నులు ఒక్కొసారి వైర‌ల్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం అలాంటి ఓ వీడియోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భ‌ర్త సీరియ‌స్‌గా డిస్క‌ష‌న్ చేస్తుండ‌గా.. భార్య వ‌చ్చి ముద్దు ఇవ్వ‌బోయింది. అప్పుడు భ‌ర్త.. భార్య‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేయ‌గా.. భార్య ముసిముసి న‌వ్వులు న‌వ్వింది.

ఓ వ్య‌క్తి జూమ్ కాల్‌లో బిజీగా ఉన్నాడు. అటుగా వ‌చ్చిన ఆ వ్య‌క్తి భార్య అత‌నికి ముద్దు ఇవ్వ‌బోయింది. దీంతో అత‌ను కొంచెం ప‌క్క‌కు ఒరిగి సీరియ‌స్‌గా చూశాడు. కెమెరా ఆన్‌లో ఉంది చూడ‌లేదా అంటూ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశాడు. మ‌హిళ మాత్రం ముసి ముసి న‌వ్వులు న‌వ్వింది. న‌డి వ‌య‌సులో ఉన్న వీరి ఫ‌న్నీ రొమాన్స్ ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఈ స‌ర‌దా వీడియోను చూసి అంద‌రూ క‌డుపుబ్బా న‌వ్వుతున్నారు. భ‌ర్త మీద భార్య‌కు ఎంత ప్రేమో అని నెటిజ‌న్లు పొగిడేస్తున్నారు.


ఈ వీడియోను పారిశ్రామిక‌వేత్త హ‌ర్ష గోయెంకా ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా.. మ‌హింద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హింద్రా కూడా ఈ వీడియోపై స్పందించారు. వైఫ్ ఆఫ్ ది ఇయ‌ర్‌కు ఈ లేడిని నామినేట్ చేస్తాన‌ని ఆనంద్ పేర్కొన్నారు. అత‌ను కూడా స‌ర‌దాగా న‌వ్వి ఉంటే.. క‌పుల్ ఆఫ్ ది ఇయ‌ర్‌కు నామినేట్ చేసే వాన్ని అని ఆనంద్ మ‌హింద్రా కామెంట్ చేశారు.


Next Story