పార్కింగ్ కోసం మహిళ కష్టాలు.. వీడియో వైర‌ల్‌.. చూస్తే మీ పొట్ట‌చెక్క‌లే

Woman struggling to parallel park video viral.ఓ మ‌హిళ త‌న కారును పార్క్ చేసేందుకు ప‌డిన పాట్ల‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2021 6:39 AM GMT
woman struggling to park

ఓ మ‌హిళ త‌న కారును పార్క్ చేసేందుకు ప‌డిన పాట్ల‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు. అదేంటి మ‌హిళ‌.. క‌ష్ట‌ప‌డి పార్కు చేస్తుంటే అయ్యో అనాల్సింది పోయి న‌వ్వ‌డం ఎందుక‌ని అంటారా..? ఆ వీడియో చివ‌ర్లో ఓ ట్విస్ట్ దాగి ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. ఇంత‌కీ ఆ వీడియో ఏం ఉందంటే..?

ఓ యువతి తన కారును మరో రెండు కార్ల మధ్య ప్యారలల్( స‌మాంత‌రంగా) పార్కింగ్ చేయడం కోసం నానా కష్టాలు పడింది. చాలా సేపు ప్ర‌య‌త్నించినా.. సాధ్యం కాకపోవడంతో కారులోంచి కిందకు దిగింది. రెండు కార్ల మ‌ధ్య ఎంత స్పేస్ ఉంది అని తెలుసుకోవ‌డానికి త‌న అడుగుల‌తో లెక్కించింది. అనంత‌రం త‌న కారును అడుగుల‌తో లెక్కించింది. పార్కింగ్ కోసం ఆమె పడుతున్న కష్టాన్ని చూసిన మరో మహిళ సాయం చేసింది. కారును పార్కింగ్ చేసేందుకు సంకేతాలు ఇచ్చింది. చివ‌రికి ఆ మ‌హిళ‌.. త‌న కారును పార్క్ చేసింది.

అయితే.. ఆ మ‌హిళ కారును పార్క్ చేసిన అనంత‌రం త‌న‌కు సాయం చేసిన మ‌రో మ‌హిళ‌కు హాగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పింది. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. సాయం చేసిన మ‌హిళ‌.. వెనుక ఉన్న తన కారును తీసుకుని వెళ్ళిపోయింది. ఈ హిలేరియస్ ట్విస్ట్ కు నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. మ‌రీ ఆ మ‌హిళ ముందుగానే త‌న కారును తీసుకుని ఎందుకు వెళ్లిపోలేదు అని కొంద‌రు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌గా.. ఆ మ‌హిళ‌కు కారు పార్కింగ్ నేర్పించేందుకే అలా చేసింద‌ని మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి ఆ వీడియో చూసేయండి.


Next Story