చనిపోయిన వారి దంతాలు, వెంట్రుకలతో.. ఉంగరాలు, కంఠహారాలు
Woman makes jewellery from the teeth of dead loved ones.మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోతే.. ఆ బాధ
By తోట వంశీ కుమార్ Published on 15 July 2021 2:38 AM GMTమనకు బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. ఆ వార్త మనల్ని ఎంతో కృంగదీస్తుంది. అయితే.. వారి మాటలు, జ్ఞాపకాలు మాత్రం మనల్నినిత్యం వేదిస్తూనే ఉంటాయి. వారికి సంబంధించిన వస్తువులను మనం పదిలంగా దాచుకుని వాటిని చూస్తూ.. వారితో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాం. ఓ మహిళ తన సన్నిహితురాలు మృతిచెందడంతో.. అంతులేని విషాదంలోకి వెళ్ళిపోయింది. ఆ విషాద ఘటన నుంచే ఆమె ఓ సరికొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. అదే.. చనిపోయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవశేషాలతో ఆభరణాలను తయారు చేయడం. చూస్తుండగానే.. ఆమె ఐడియా ఎందరికో నచ్చి.. ఆమెకు ఆర్డర్స్ రావడం మొదలైంది.
ఆస్ట్రేలియా కు చెందిన జాక్వి విలియమ్స్ అనే ఓ మహిళ చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో ఉంగరం, చైన్, ఇయర్ రింగ్స్ వంటి ఆభరణాలను తయారు చేస్తోంది. చనిపోయిన వ్యక్తుల బూడిద గాని, దంతాలు, వెంట్రుకలను ఇచ్చినా సరే వాటిని ఆమె అందమైన ఆభరణాలుగా మార్చి ఇస్తోంది. చనిపోయిన వారి గుర్తు గా ఇలాంటి ఆభరణాలను తయారు చేయించుకోవడానికి ఎందరో ఆసక్తిని కనబరుస్తున్నారు.
తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబ కోసం ఐయూడీని ఉపయోగించి ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చాను. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలైంది. ఈ ఆభరణాలను తయారు చేయడానికి ఎనిమిది వారాలు పడుతుంది. వీటి ధర 350 నుంచి 10,000 డాలర్ల వరకు ఉంటుంది. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతో ఈ పని చేస్తున్నాను. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్‌సైట్‌లో వీటిని విక్రయానికి పెట్టాను అని విలియమ్స్ చెప్పుకొచ్చింది.
దంతాలు, అస్థికలు, వెంట్రుకలు.. ఇలా ఏవి తీసుకొచ్చినా వాటి తో ఆమె అందమైన ఆభరణాలను రూపొందించి ఇచ్చేది. ఇందుకోసం రోజూ ఆమెకు చాలా రిక్వెస్ట్ లు వస్తూ ఉంటాయట. ఐతే.. కొన్నింటిని ఆమె రిజెక్ట్ చేశారట. ఎందుకంటే.. ఒక వ్యక్తి ఒక బుల్లెట్ ను తీసుకొచ్చి నగ చేయమని అడిగాడట. అతని తాతగారు.. ఆ బుల్లెట్ తోనే పేల్చుకుని, ఆత్మహత్య చేసుకున్నారట. అయితే.. దానిని సున్నితం గా తిరస్కరించారు. ఇలాంటి వాటితో తాను చేయనని.. తాను కేవలం మనిషి అవశేషాలతో మాత్రమే చేస్తానని చెప్పారట. ప్రస్తుతం ఆమె తయారు చేస్తున్న నగలకు ఎంతో డిమాండ్ ఏర్పడింది.