దాడి చేయబోతే.. లిప్‌కిస్.. నాలుక కట్.. పక్షి ఎత్తుకెళ్లిపోయింది..!
Woman bites off mans tongue during violent street fight.ఓ మహిళకు ఓ వ్యక్తికి రోడ్డుపై గొడవ జరిగింది.
By తోట వంశీ కుమార్
ఓ మహిళకు ఓ వ్యక్తికి రోడ్డుపై గొడవ జరిగింది. దీంతో అతడు ఆమెపై దాడి చేసేందుకు యత్నించగా.. ఆ మహిళ అతడికి లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది. ఈ క్రమంలో అతడి నాలుకను గట్టిగా కొరింది. దీంతో రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కిందపడింది. ఆకాశంలో తిరుగుతున్న పక్షి దీనిని గమనించి.. కింద పడిన నాలుకను నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్‌లో 2019లో జరుగగా.. ఇటీవల ఆ మహిళకు కోర్టు జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై వెలుతున్న జేమ్స్ మెకెంజీ అనే వ్యక్తికి 27 ఏళ్ల బెథానీ ర్యాన్‌తో ఏదో విషయంలో చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో రోడ్డుపైనే వారిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో మెకెంజీ పిడికిలి బిగించి ర్యాన్‌పై దాడి చేసేందుకు వెళ్లగా.. ఊహించని రీతిలో బెథానీ అతడికి లిప్‌టూలిప్ కిస్ ఇచ్చింది. దీంతో కూల్ అయిన మెకెంజీ ముద్దులో మునిగితేలుతుండగా.. ర్యాన్ ఊహించని షాక్ ఇచ్చింది. అతడి నాలుకను రెండు ఇంచుల మేర కొరికి రోడ్డుపై ఉమ్మివేసింది. అయినప్పటికి మెకెంజీ ఆ విషయాన్ని గమనించలేదు.
మరల ఆమెతో గొడవకు దిగాడు. అయితే.. కిందపడ్డ నాలుకను అక్కడే చెట్టుపై ఉన్న సిగుల్ పక్షి చూసింది. వెంటనే నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని ఎగిరిపోయింది. అది గమనించిన స్థానికులు మెకెంజీని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అతడికి ఆపరేషన్ చేయాలన్నారు. తెగిపడిన ముక్కను తీసుకొని వస్తే.. ఆపరేషన్ చేస్తామన్నారు. జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో.. ఆపరేషన్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గత వారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్‌బర్గ్ ఫరీఫ్ కోర్టులో ర్యాన్ తను చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరింది. అయితే ఆమెకు శిక్ష విధించకుండా కోర్టు జరిమాన విధించింది.