చింపాజీతో ప్రేమాయ‌ణం.. ఆ మ‌హిళ‌ను బ్యాన్ చేసిన అధికారులు

Woman banned from zoo after unhealthy relationship with chimp.ఈ ప్ర‌పంచంలో జంతుప్రేమికులు, ప్ర‌కృతి ప్రేమికులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2021 5:52 AM GMT
చింపాజీతో ప్రేమాయ‌ణం.. ఆ మ‌హిళ‌ను బ్యాన్ చేసిన అధికారులు

ఈ ప్ర‌పంచంలో జంతుప్రేమికులు, ప్ర‌కృతి ప్రేమికులు చాలా మందే ఉన్నారు. వారంతా ప‌ర్యావ‌ర‌ణం, జంతువులు, ప‌క్షుల బాగోగుల కోసం వారి జీవితంలో అధిక భాగం వెచ్చిస్తుంటారు. కొంద‌రు పిల్లిని ప్రేమిస్తే ఇంకొంద‌రు గుర్రం, కుక్క‌, పులి, పాముల‌ని పెంచుకుంటూ ఉంటారు. మ‌నుషుల క‌న్నాఎక్కువ‌గా వాటిని ప్రేమిస్తుంటారు. ఇక సెల‌బ్రెటీలు అయితే.. వాటికి పుట్టిన రోజు వేడుక‌లు చేయ‌డం మ‌నం చాలానే చూశాం. అయితే జూకి వెళ్లిన ఓ మ‌హిళ అక్క‌డ ఉన్న చింపాజీతో ప్రేమ‌లో ప‌డింది. అవును మీదు చ‌దివింది నిజ‌మే.. చింపాంజితోనే ఓ మ‌హిళ ప్రేమ‌లో ప‌డింది. నాలుగేళ్లు దానిని కొన‌సాగించింది. ఈ వింత ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది.

వివ‌రాల‌లోకి వెళితే.. బెల్జియంకు చెందిన ఆది టిమ్మర్ మన్స్ అనే మ‌హిళ‌ జంతు ప్రేమికురాలు. రెగ్యులర్‌గా ఆమె జూ కు వెలుతుండేది. ఈ క్ర‌మంలో 'చిటా' అనే 38 ఏళ్ల చింపాంజితో ప్రేమలో పడింది. చింపాంజి కూడా రెగ్యుల‌ర్‌గా వ‌స్తున్న ఈ మ‌హిళ‌ని గ‌మ‌నిస్తూ ఉండేది. కొన్ని రోజుల త‌రువాత ఇద్దరి మ‌ధ్య బంధం ఏర్ప‌డింది. చిటా మరియు టిమ్మర్‌మన్స్ ఒకరినొకరు చూసుకుంటూ.. గ్లాస్ ఎన్ క్లోజర్ ఎదురుగా నిలబడి 'హాయ్, బాయ్' చెప్పుకుంటూ ఉండేవారు.సైగలతో సంభాషించుకునే వారు. ఆ తర్వాత చేతులు ఊపుతూ గాల్లో 'ముద్దులు' కూడా పెట్టుకునే వారు.

ఇలాగే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే.. ఈ మ‌ధ్య‌లో కాలంలో చింపాంజీలో మార్పులు రావ‌డం గ‌మ‌నించిన సిబ్బంది టిమ్మర్ మన్స్‌ను నిలదీశారు. దాంతో మా ఇద్దరి మధ్య 'ఎఫైర్' నడుస్తుందని చెప్పింది టిమ్మర్‌మన్స్‌. ఆమె స‌మాధానంతో షాకైన అధికారులు ఆమెను మ‌ళ్లీ జూకి రాకుండా నిషేదించారు. ఈ విష‌యంపై మాట్లాడిన జూ అధికారులు.. జూలో జంతువులపై మనుషులు ఎక్కువ అప్యాయతగా, ప్రేమగా మెలిగినా అవి వింతగా ప్రవర్తిస్తాయని, వారితో తప్ప.. ఇతర జంతువులతో కలిసి ఉండలేవని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే.. చిటా పై పెను ప్రభావం చూపుతుందనే కారణంతోనే ఆ మహిళపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story