ఈ వైన్ కొనాలంటే ధనవంతులైనా సరే.. ఆస్తులమ్ముకోవాల్సిందే.

Wine That Went to Space for Sale.వైన్ బాటిల్ కాస్ట్ కానీ ఈ వైన్ బాటిల్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. ఎందుకంటే ఈ బాటిల్‌కు 10 లక్షల డాలర్లు అంటే దాదాపు 7 కోట్ల రూపాయలు ధర పలకొచ్చని అంచనా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2021 11:37 AM IST
wine went to space

వైన్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుంది మహా అయితే రూ.5,000.. ఇంకొంచం ఓల్డ్ అయితే రూ.10 వేలు ఉండచ్చేమో.. అలా గోవా వెళితే కాస్త తక్కువకి కూడా దొరకచ్చు.. కానీ ఈ వైన్ బాటిల్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. ఎందుకంటే ఈ బాటిల్‌కు 10 లక్షల డాలర్లు అంటే దాదాపు 7 కోట్ల రూపాయలు ధర పలకొచ్చని అంచనా.. అంత స్పెషల్ ఏముంది అంటారా ఈ బాటిల్ లో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఏడాదికి పైగా పులియబెట్టిన వైన్ ఇది..

ఐఎస్ఎస్‌లో ఏడాదికి పైగా ఉన్న `పెట్రస్ 2000` అనే ఫ్రెంచ్ వైన్ బాటిల్‌ను క్రిస్టీస్ సంస్థ వేలానికి పెట్టింది. భూమికి వెలుపల వ్యవసాయం చేసే అవకాశాలపై పరిశోధన చేసేందుకు స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్ అనే సంస్థ పనిలో పనిగా 2019 నవంబర్‌లో 19 వైన్ బాటిల్స్‌ను అక్కడికి పంపింది. దాదాపు 14 నెలల తర్వాత వీటిని భూమికి రప్పించింది. భూమిపై అంతే కాలం పులియబెట్టిన వైన్‌తో వీటి రుచిని పరిశోధకులు పోల్చి చూశారు. భూమిపై ఉన్న పానీయంతో పోల్చితే రోదసీలోకి వెళ్లి వచ్చిన వైన్ రుచిగా, మృదువుగా, సువాసనభరితంగా ఉందని తేల్చారు. అక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ పరిశోధన చేశారు. జీరో గ్రావిటీ తో కూడిన ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్‌ వచ్చిందని క్రిస్టీస్‌ వైన్‌ అండ్‌ స్పిరిట్స్‌ విభాగం డైరెక్టర్‌ టిమ్‌ టిప్‌ట్రీ చెప్పారు. దీంతో ఈ సీసా ధర పెరిగిపోయిందన్నారు.




Next Story