భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. భార్య మూడ్ ఎలా ఉందో తెలుసుకోకుండా ప్రవర్తిస్తే భర్తకు మూడిందే. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్తకు భార్య మొబైల్‌లో చాటింగ్ చేస్తూ కనిపించింది. ఎవరితో చాటింగ్ చేస్తున్నావని అడిగాడు. అంతే.. ఆ భార్యకు చిర్రెత్తుకు వచ్చింది. పక్కనే ఉన్న కర్రతో భర్తను కొట్టింది. ఆ భర్త మూడు పళ్లు రాలిపోయాయి. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. శిమ్లా జిల్లా థియోగ్లో సమీపంలోని చైలాచౌకీ ప్రాంతంలో అమిత్‌కుమార్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. రోజులాగానే ఉద్యోగానికి వెళ్లి వచ్చాడు. అతడు ఇంట్లోకి వస్తూ.. భార్య తీరిక లేకుండా వాటాప్స్‌లో చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించాడు. ఎవరితో చాటింగ్ చేస్తున్నావని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భర్తపై ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. అక్కడే ఓకర్రతో అతడిని చితకబాదింది. ఈక్రమంలో కర్ర అతడి దవడకు తగింది. దీంతో అమిత్‌కుమార్ మూడు పళ్లు ఊడిపోయాయి. కొద్దిసేపటికి తేరుకున్న అతడు.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా పలు సెక్షన్ల కింద బాధితుడి భార్యపై కేసు నమోదు చేశారు.