రా బావ తిని చూడు.. మ‌ర‌ద‌లు పిల్ల పిలువ‌లే.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Viral photo of new funny Restaurant Raa Baava Tini Choodu. సోష‌ల్ మీడియాలో ఓ హోట‌ల్‌కు సంబంధించిన పేరు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆ హోట‌ల్ పేరు ఏంట‌ని అంటారా..'రా బావ తిని చూడు'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2021 7:09 AM GMT
Viral photo of new funny Restaurant Raa Baava Tini Choodu

క‌రోనా కార‌ణంగా హోటల్స్‌, రెస్టారెంట్లు బాగా న‌ష్ట‌పోయాయి. ఈ మ‌హ‌మ్మారిని అంతం చేయడానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. అయిన‌ప్ప‌టికి జ‌నాలు హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌కు వెళ్ల‌డానికి జంకుతున్నారు. ఇప్పుడిప్పుడే.. కాస్త వాటి ముఖం చూస్తున్నారు. అయిన‌ప్ప‌టికి క‌రోనా క‌న్నా ముందులా వ్యాపారం లేదంటున్నారు వాటి య‌జ‌మానులు. ఈ క్ర‌మంలో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తూ ఉన్నారు నిర్వాహ‌కులు. ఏం చేసినా సరే ఓ ప్రత్యేకత చూపాలని భావిస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ హోట‌ల్‌కు సంబంధించిన పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆ హోట‌ల్ పేరు ఏంట‌ని అంటారా..'రా బావ తిని చూడు' అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ హోటల్ ఎక్కడుందో ఏమో తెలియదు. పేరు తెలుగులో ఉంది కాబ‌ట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డో ఓ చోట ఉండి ఉంటుంద‌ని అనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. దీనిపై నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. నన్ను ఇప్పటివరకూ అలా ఎవరు పిలవలేదు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే… మరికొంతమంది పిలవడం వరకు ఓకే బిల్లు ఏ మాత్రం ఏస్తారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ హోట‌ల్ పేరుతోనే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోవడంలో హోటల్ నిర్వాహకులు ఓ విధంగా సక్సెస్ సాధించారనే చెప్పుకోవాలి.
Next Story