'నా దందా స్టైలే ఇంతా'.. ట‌మాటాలపై సోష‌ల్ మీడియాలో పేలుతున్న మీమ్స్‌

దేశవ్యాప్తంగా టమాటా రచ్చ మామూలుగా లేదు. టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. ఎక్క‌డ చూసినా.. ట‌మాటా కిలో ధ‌ర రూ.150కిపైనే ఉంది.

By అంజి  Published on  13 July 2023 8:27 AM IST
funny memes,  social media, Tomato Prices, Viral memes

'నా దందా స్టైలే ఇంతా'.. ట‌మాటాలపై సోష‌ల్ మీడియాలో పేలుతున్న మీమ్స్‌

దేశవ్యాప్తంగా టమాటా రచ్చ మామూలుగా లేదు. టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. ఎక్క‌డ చూసినా.. ట‌మాటా కిలో ధ‌ర రూ.150కిపైనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ.200 కూడా దాటింది. దీంతో ప్ర‌జ‌లు ట‌మాటాలు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. కిలో ట‌మాటా కొనేబ‌దులు.. హాఫ్ కేజీ చికెన్ కొనుక్కోవ‌డం బెట‌ర్ అని అనుకుంటున్నారు. చాలా చోట్ల టమాటాలు చోరీకి గురికావడం.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి.

టమాటాలపై వార్తా కథనాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతన్నప్పటికీ టమాటా ధరలే ట్రెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ట‌మాటా ధ‌ర‌లు భ‌గ్గుమంటున్న నేప‌థ్యంలో నెటిజ‌న్లు ఊరుకుంటారా?.. వాళ్ల స్టైల్లో వాళ్లు మీమ్స్‌ చేస్తున్నారు. పెరిగిన టమాటాల ధరలతో సోషల్‌ మీడియాలో మీమర్స్‌ చెలరేగిపోతున్నారు. టామాటాలు, పచ్చిమిర్చి ధర పెరిగిన నేపథ్యంలో నెటిజన్లు పలు రకాల మీమ్స్ తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పలు సినిమాల్లోని సీన్లు, చిత్రాలతో మీమ్స్‌ రూపొందిస్తున్నారు.

పెరిగిన ధరల వల్ల ప్రజలు ఎంత ఇబ్బందిపడుతున్నారో సెటైరికల్‌గా చూపిస్తున్నారు. టామాట.. టమాటా సాస్ ధరలను పోలుస్తూ, మిర్చి.. టామాటాలను పోలుస్తూ మీమ్స్‌ చేస్తూ నెట్టింట పోస్టు చేస్తున్నారు. కొన్ని ఫ‌న్నీగా.. మ‌రికొన్ని ఆలోచణాత్మ‌కంగా ఉన్నాయి. మొత్తానికి నెటిజ‌న్లు టమాటాలపై ఫ‌న్నీ మీమ్స్‌తో సోష‌ల్ మీడియాను నింపేశారు. అవి చూస్తే మీరు కూడా న‌వ్వు ఆపుకోలేరు మరి. ట‌మాటా ధ‌ర‌ల గురించి కాసేపు ప‌క్క‌న పెట్టి ఎంతో క్రియేటివిటీగా చేసిన ఈ ఫ‌న్నీ మీమ్స్‌ను చూసి కాసేపు హాయిగా న‌వ్వుకోండి.

Next Story