మీ మ‌నుషులే డ్యాన్స్ చేస్తారా..? ఏం మేము చేయ‌లేమా అంటుంది ఓ తాబేలు. మాములు డ్యాన్స్ చేస్తే కిక్కు ఏం వ‌స్తుంది చెప్పండి. అందుక‌నే ఏకంగా ష‌వ‌ర్ డ్యాన్స్ చేస్తోంది. ష‌వ‌ర్ కింద తాబేలు డ్యాన్స్ చేసే వీడియోను ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం నెటింట్ట అది వైర‌ల్‌గా మారింది.

అంత‌రించిపోతున్న మడగాస్కర్ రేడియేటెడ్ జాతీ తాబేళ్ల‌ను అమెరికాలోని టెన్నెసీ అక్వేరియంలో ప్ర‌త్యేకంగా పెంచుతున్నారు. అందుకోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. వీటికి త‌ర‌చు ష‌వ‌ర్‌తో పాటు మ‌సాజ్ కూడా చేస్తుంటార‌ట అక్క‌డి సిబ్బంది. అయితే.. అన్ని తాబేళ్లలో క‌న్నా.. ట‌ర్నిప్ అనే తాబేలు మాత్రం ష‌వ‌ర్ ఆన్‌చేయ‌గానే డ్యాన్స్ చేస్తుంది. దీని వ‌య‌సు 12 సంవ‌త్స‌రాలు.


సాధారణంగా తాబేళ్లకు స్నానం చేయించే సమయంలో డ్యాన్స్ చేస్తుంటాయి. కానీ, ఈ తాబేలు మాత్రం వాటికి భిన్నంగా మరింత వయ్యారంగా డ్యాన్స్ చేసింది. వాటర్ ట్యూబ్ తో నీళ్లు షవర్ చేసినంత సేపు డ్యాన్స్ చేసింది. ఆపేయగానే ఆగిపోయింది. తిరిగి నీళ్లు పోయ‌గానే.. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన చిన్న వీడియోను అక్క‌డ ప‌నిచేసే ఓ సిబ్బంది సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి వీడియో చూసేయండి.


తోట‌ వంశీ కుమార్‌

Next Story