మంచినీళ్లు ఎక్కువ తాగడంతో మహిళ మృతి..అమెరికాలో షాకింగ్ ఘటన

అమెరికాలో షాకింగ్‌ సంఘటన వెలుగు చూసింది. నీళ్లు ఎక్కువగా తాగిన ఓ 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2023 11:32 AM IST
America, Woman Dead, Drink Water, Shocking news,

మంచినీళ్లు ఎక్కువ తాగడంతో మహిళ మృతి..అమెరికాలో షాకింగ్ ఘటన

ఇప్పటి వరకు మనం డీహైడ్రేషన్‌తో చనిపోయినవారిని చూశాం. నీళ్లు సరిపడా తగకుండా ఎండలకు తిరగడంతో ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. ఇండియాలో సమ్మర్‌లో అయితే ఇలాంటి మరణాలు వెలుగు చూస్తుంటాయి. అయితే.. నీళ్లు ఎక్కువ తాగినా కూడా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ సంఘటన అమెరికాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

అమెరికాలోని న్యూయార్క్‌లో జూలై మొదటి వారం ఎండింగ్‌లో మహిళ చనిపోయినట్లు తెలుస్తోంది. మృతిచెందిన మహిళ పేరు యాష్లే సమ్మర్స్‌. జూలై మొదటి వారంలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అయితే.. వీరు వెకేషన్‌కు వెళ్లినప్పుడు ఎండలు దంచికొడుతున్నాయి. ఆ సమయంలో యాష్లే డీహైడ్రేషన్‌కు గురైంది. ఉపశమనం కోసం.. తక్కువ సమయంలోనే నాలుగు బాటిళ్ల మంచినీరు తాగింది. అదే ఆమెకు అసలు సమస్యను తెచ్చిపెట్టింది. కాసేపటికే యాష్లే తీవ్ర అసౌకర్యానికి గురైంది. ఆ తర్వాత స్పృహతప్పి కింద పడిపోయింది.

డీహైడ్రైషన్‌కు గురైనప్పుడు యాష్లే కేవలం 20 నిమిషాల్లో నాలుగు బాటిళ్ల వాటర్‌ అంటే సమారు రెండు లీటర్ల మంచినీరు తాగింది. అదే ఆమె చేసిన తప్పుగా మిగిలింది. ఆమె స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. యాష్లే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. యాష్లె వాటర్ టాక్సిసిటీతో మరణించినట్లు వైద్యులు చెబతున్నారు. వాటర్‌ టాక్సిసిటీ చాలా అరుదు అని.. అలాగే చాలా ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో మంచినీరు సేవించినా.. లేదంటే అనారోగ్య సమస్యల కారణంగా కిడ్నీలోకి ఎక్కువ నీరు వెళ్లినా వాటర్ టాక్సిసిటీ వస్తుందని చెబుతున్నారు వైద్యులు. తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు వాటర్‌ టాక్సిసిటీ లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు.

వేసవి కాలంలో వాటర్‌ టాక్సిసిటీ ఎక్కువగా వచ్చే చాన్స్ ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఎక్కువగా నీరు తాగడం, అదే సమయంలో రక్తంలో సోడియం స్థాయి పడిపోవడంతో ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. అయితే.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే ప్రజలు ఎలక్ట్రొలైట్లు, సోడియం-పొటాషియం డ్రింగ్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎక్కువ నీరు తాగడంతో తమ సోదరి చనిపోవడం షాక్‌కు గురి చేసిందని ఆమె సోదరులు చెబుతున్నారు. వాటర్‌ తాగి యాష్లే కిందపడిపోవడంతో ఏమీ అర్థం కాలేదని.. ఆస్పత్రికి తరలించాక వైద్యులు చికిత్స చేశారని కానీ లాభం లేకపోయిందని చెప్పారు. అప్పటి వరకు తమకు వాటర్‌ టాక్సిసిటీ అనేది ఒకటుందనే విషయం కూడా తెలియదని చెబుతున్నారు. యాష్లేకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని ఆమె బంధువులు చెబుతున్నారు.

Next Story