మూడేళ్ల కిందట అదృశ్యమైన మహిళ.. అందరూ చనిపోయిందనుకున్నారు.. కానీ..

దాదాపు మూడేళ్లుగా అత్తమామల ఇంటి నుంచి కనిపించకుండా పోయిందో మహిళా. అయితే ఆమె చనిపోయినట్లు అందరూ భావించారు.

By అంజి  Published on  9 Oct 2024 7:48 AM IST
UP woman, assumed dead, missing, Viral

మూడేళ్ల కిందట అదృశ్యమైన మహిళ.. అందరూ చనిపోయిందనుకున్నారు.. కానీ..

దాదాపు మూడేళ్లుగా అత్తమామల ఇంటి నుంచి కనిపించకుండా పోయిందో మహిళా. అయితే ఆమె చనిపోయినట్లు అందరూ భావించారు. అయితే అప్పటి నుండి మహిళ ఆచూకీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆరా తీస్తూ వచ్చారు. తాజాగా లక్నోలో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి జీవిస్తున్నట్లు తెలిసింది. గోండాకు చెందిన కవిత (23) నవంబర్ 17, 2017న దాదువా బజార్‌లో నివాసముంటున్న వినయ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే, ఆమె మే 5, 2021న తన అత్తమామల ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు, ఆమె అత్తమామలు, ఒకరిపై ఒకరు హత్య, కిడ్నాప్ కేసులు నమోదు చేస్తారు

"కవిత కుటుంబసభ్యులు ఆమె అత్తమామలను హత్య చేశారని ఆరోపించారని, దీంతో ఆమె భర్త, బావ, అత్తగారు, కోడలుపై కేసు నమోదు చేశామని" గోండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వినీత్ తెలిపారు. విస్తృతంగా వెతికినా కవిత ఆచూకీ తెలియలేదు. 2022 డిసెంబర్‌లో కవిత సోదరుడు అఖిలేష్‌తో సహా ఆరుగురిపై భర్త వినయ్ కుమార్ కూడా ఆమెను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఎస్పీ వినీత్ జైస్వాల్ ప్రకారం.. రెండు విచారణలు కొనసాగుతున్నాయి, అయితే కవిత ఆచూకీలో పురోగతి లేదు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా, పోలీసుల చర్యల వివరాలను కోరింది.

తాజాగా పోలీసులు కవితను లక్నోలోని ఆమె ప్రియుడు సత్య నారాయణ్ గుప్తా ఇంట్లో గుర్తించారు. "సత్య నారాయణ్ గోండాలోని దుర్జన్‌పూర్ మార్కెట్‌లో ఒక దుకాణాన్ని కలిగి ఉన్నాడు. కవిత తరచుగా అతనిని చూడటానికి వెళ్లేది. వారి సంబంధం మరింత దగ్గరైంది, ఆమె అతనితో పారిపోయేలా చేసింది" అని ఎస్పీ చెప్పారు. లక్నోకు వెళ్లడానికి ముందు ఏడాది పాటు అయోధ్యలో తన ప్రియుడితో కలిసి జీవించినట్లు కవిత తెలిపారు. ప్రస్తుతం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు.

Next Story