సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్‌లో స్టార్లుగా మారుతున్నారు. దీంతో కొందరు వ్యక్తులు బైకులపై, కార్లపై స్టంట్లు చేస్తూ హీరోల్లా ఫీలవుతున్నారు. తాము చేసింది ఘనకార్యంలా బావిస్తూ సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నడి రోడ్డుపై ఇతరులకు హాని కలిగించే ఇలాంటి సాహాసాలు చేయడం నిషేదం అయినప్పటికి వారు దీనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఓ వ్యక్తి నడి రోడ్డుపై కారు నడుపుతున్నాడు. కారు ముందుకు వెలుతుండగా.. సడెన్ గా కారు స్టీరింగ్ వదిలేసి..కారు టాప్‌పైకి ఎక్కి పుషప్స్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది క్షణాల్లో ఈ వీడియోలో వైరల్‌గా మారింది. అలా ఈ వీడియో పోలీసుల కంటపడింది. వెంటనే అతడికి బహుమతి ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. సమాజ్ వాదీ పార్టీ నేత కృష్ణ మురారీ యాదవ్ కొడుకు ఉజ్వల్ యాదవ్ ఫిరోజాబాద్‌లో కదిలే కారు స్టీరింగ్ వదిలివేసి.. కారుపైకి ఎక్కి పుషప్స్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్షణాల్లో ఈవీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల కంట పడింది. వెంటనే స్టంట్స్ చేసిన వ్యక్తినీ, వీడియో షూట్ చేసిన వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించారు. కారు ఓనర్ కృష్ణమురారీ, స్టంట్ చేసిన ఉజ్వల్ యాదవ్‌కి ఫైన్ వేశారు. తాను ఓ ప్రమాదకర వీడియో చేశాననీ.. ఇకపై ఎప్పుడూ అలా చెయ్యనని తన తండ్రి ముందు మాట ఇచ్చాడు ఉజ్వల్ యాదవ్.
మరికొందరు కూడా ఇలా చేసే అవకాశం ఉందని బావించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే ఓ వార్నింగ్ వీడియోను తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. స్ట్రాంగ్‌గా ఉండండి.. సేఫ్‌గా ఉండండి అని వీడియోపై క్యాప్షన్ పెట్టారు.