వైర‌ల్‌.. మండ‌పంలోనే వ‌రుడి చెంప ప‌గుల‌గొట్టిన వ‌ధువు

UP bride slaps groom twice on stage as he tries to garland her.ఇటీవ‌ల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోష‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2022 12:51 PM IST
వైర‌ల్‌.. మండ‌పంలోనే వ‌రుడి చెంప ప‌గుల‌గొట్టిన వ‌ధువు

ఇటీవ‌ల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో కొన్ని వీడియోలు ఫ‌న్నీగా ఉంటే.. మ‌రికొన్ని మాత్రం ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందులో పెళ్లి కుమారుడి చెంప‌ను పెళ్లి కూతురు ప‌గ‌ల‌కొట్టింది. అనంత‌రం వేదిక‌పై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహా వేడుక‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. లాల్‌పురా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని స్వాసా బుడ్జ్ గ్రామానికి చెందిన మ‌నోహ‌ర్ అహిర్వార్ కూతురు రీనాకు జలౌన్ జిల్లా చ‌మారీ గ్రామానికి చెందిన ర‌వికాంత్ అహిర్వార్‌తో పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఆదివారం రాత్రి పెళ్లి బ‌రాత్ వ‌ధువు ఇంటికి చేరుకుంది. వారికి ఘ‌న స్వాగ‌తం చెప్పే క్ర‌మంలో కొత్త‌ జంట పూల దండ‌లు మార్చుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా వ‌ధువు మెడ‌లో వ‌రుడు పూల వేస్తుండ‌గా.. పెళ్లి కూతురు ఒక్క‌సారి పెళ్లి కొడుకుపై విరుచుకుప‌డింది.

వ‌రుడి చెంప చెల్లుమ‌నిపించింది. అలా ఓ నాలుగైదు సార్లు చేసింది. అనంత‌రం కోపంతో స్టేజీ దిగి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డ ఉన్న వారు అంతా షాక్‌కు గురైయ్యారు. ఏం జ‌రిగింద‌ని ఆరా తీయ‌గా.. దండ వేయించుకోవ‌డానికి తాను ఇంకా సిద్ధం కాలేద‌ని అందుకే వ‌రుడిని కొట్టిన‌ట్లు వ‌ధువు చెప్పింది. ఈ ఘ‌ట‌న ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాలు కొట్టుకోవ‌డంతో ప‌లువురికి గాయాలైన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు కుటుంబాల‌కు స‌ర్ది చెప్ప‌డంతో సోమ‌వారం ఇరువురు పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story