ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నాడు. వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపాలని అనుకున్నాడు. అయితే.. ఏవేవో కారణాలు చెబుతూ అతడి భార్య రెండు నెలలుగా దూరంగా ఉంటుంది. భార్య అనారోగ్యాన్ని నయం చేసేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో ఓ షాకింగ్ నిజం తెలిసింది. దీంతో ఆశ్చర్యపోవడం సదరు భర్త వంతు అయ్యింది. తాను వివాహం చేసుకుంది మహిళను కాదని హిజ్రాను అని తెలియడంతో షాక్‌కు గురైయ్యారు. తనను మోసం చేసిన అత్తామామలపై కేసు పెట్టాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
కాన్పుర్కు చెందిన ఓ వ్యక్తికి పంకి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఏప్రిల్ 28న ఘనంగా వివాహం జరిగింది. అయితే.. పెళ్లై చాలా రోజులైనప్పటికీ ఇరువురి మధ్య దాంపత్య జీవితం సాఫీగా సాగడం లేదు. అనారోగ్యం పేరుతో ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఇక భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అనంతరం డాక్టర్లు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమె మహిళ కాదని.. ట్రాన్స్ జెండర్ అని తెలిసింది. దీంతో అతడు.. . తన భార్య వైద్య నివేదికతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు, వధువుతో పాటు ఆమె తల్లిదండ్రులు, వివాహా మధ్యవర్తిపై ఫిర్యాదు చేశాడు. అత్తమామలతో పాటు సెక్షన్ 420 కింద 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.