''లక్షల మనుషుల్ని కాదు.. నీ నుంచి నీ లోంచి తప్పిపోయిన మనిషిని వెతుకు'' అంటూ ఓ కవి రాసిన పదాలు ఓ వ్యక్తి చేసిన పనికి సరిగ్గా సరిపోయయాయి. ఓ 50 ఏళ్ల వ్యక్తి తానెవ్వరో మర్చిపోయి.. పోలీసులతో కలిసి వెదుకులాట ప్రారంభించాడు. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెట్టారు. ఈ ఘటన టర్కీ దేశంలోని బుర్సా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. బేహాన్‌ ముట్లు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇటీవల ఫారెస్ట్‌కు ట్రెక్కింగ్‌ వెళ్లాడు. అయితే మార్గం మధ్యలో బాగా మద్యం సేవించి దారి తప్పిపోయాడు. అతడి కోసం ఫారెస్ట్ చాలా సేపు వెదికారు.

అయితే తన మిత్రుడి ఆచూకీని కనిపెట్టలేకపోయిన తన ఫ్రెండ్స్‌.. పోలీసులకు సమాచారం అందించి వెనుదిరిగారు. అతడి ఫొటో కూడా లేకపోవడంతో పేరు చెప్పి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఫారెస్ట్‌లో అతడి కోసం గాలిస్తూ 'ముట్లు ముట్లు బేహాన్‌' అంటూ కేకలు పెట్టసాగారు. ఇది విన్న మద్యం మత్తులో ఉన్న 'ముట్లు' ఎవరో తప్పిపోయి ఉంటారని వారి కోసం పోలీసులు గాలిస్తున్నారనుకొని.. పోలీసులతో కలిసి వెదకడం ప్రారంభించాడు. తననే వెదుకుతున్నారని తెలియన 'ముట్లు ముట్లు' అంటూ కేకలు పెడుతూ కొన్ని గంటల పాటు వెతుక్కున్నాడు. ఇంతలోనే ముట్లు బంధువులు ఫొటోలను పోలీసులకు ఇచ్చారు. ఇప్పటిదాకా తాము వెతుకుతున్న ముట్లు తమతోనే ఉండటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story